Hair Growth: జుట్టు పెరుగుదలకు ఉల్లి, వెల్లుల్లి రెండింటిలో ఏది బెస్ట్?
ABN , Publish Date - May 10 , 2024 | 05:23 PM
కుదుళ్లను బలోపేతం చేయడంలో ఉల్లి, వెల్లుల్లి రెండూ ప్రభావవంతంగానే పనిచేస్తాయి. ఉల్లిలో సల్ఫర్ ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరం. పెయిర్ ఫోలికల్స్ పెరుగుదలలో ముఖ్యమైన ప్రోటీన్. ఉల్లిపాయలో క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది.
పొడవాటి, అందమైన జుట్టు కావాలనేది అందరి ఆడవాళ్లు కోరుకునేదే.. జుట్టు అందంగా పెరగాలంటే తగిన పోషణ కూడా అంతే అవసరం. నిజానికి పెరుగుతున్న కాలుష్యంతో ముందుగా ఎఫెక్ట్ అయ్యేది వెంట్రుకలే. కాలుష్యం కారణంగా విపరీతంగా వెంట్రుకలు రాలిపోవడం, చుండ్రు, పేలవంగా మారడం ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి మార్కెట్లో లభించే రకరకాల ఉత్పత్తులను ట్రై చేసినా ఫలితం మాత్రం తక్కువే. జుట్టు పెరుగుదలలో ఇంటి చిట్కాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ఉల్లి రసం, వెల్లుల్లి జుట్టుకు మంచి పోషణను అందిస్తాయి. వీటిలో ఏది బెస్ట్ అనేది చూద్దాం.
కుదుళ్లను బలోపేతం చేయడంలో ఉల్లి, వెల్లుల్లి రెండూ ప్రభావవంతంగానే పనిచేస్తాయి. ఉల్లిలో సల్ఫర్ ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరం. పెయిర్ ఫోలికల్స్ పెరుగుదలలో ముఖ్యమైన ప్రోటీన్. ఉల్లిపాయలో క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మంటను తగ్గిస్తుంది. తలలో రక్త ప్రసరణను పెంచుతుంది. పెరిగిన రక్త ప్రసరణ హెయిర్ ఫోలికల్స్ కు పోషణ, జుట్టు పెరుగుదలను పెంచుతాయి.
Cold and Cough : వేసవిలో ఏది తీసుకున్నా జలుబు తప్పడంలేదా.. ఇలా చేసి చూడండి..
ఇక వెల్లుల్లిలో కూడా హెయిర్ ఫోలికల్స్ ను బలోపేతం చేయడానికి, విరిగిపోవడాన్ని తగ్గించడానికి మెరుగైన రక్త ప్రసరణకు స్కాల్ప్ ను ఉత్తేజ పరుస్తాయి. వెల్లల్లిలోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలున్నాయి. అల్లిసిన్ అనే సమ్మేళనం కూడా కలిగి ఉంటుంది. ఇది చుండ్రును, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. అయితే ఉల్లితో పోల్చితే జుట్టుపెరుగుదలలో వెల్లుల్లి కాస్త తక్కువ గుణాలనే చూపుతుంది.
ఈ రెండింటిలోనూ సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంది. ఈ రెండు రసాలను తలకు పట్టించుకునే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. అందరికీ వీటి ఘాటు వాసన, మండించే గుణాలు పడకపోవచ్చు. కనుకు ప్యాక్ వేసుకునే ముందు కాస్త పరీక్షచేసుకుని వేసుకోవడం మంచిది.
Read Latest Navya News and Thelugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.