Health Benefits : చింతపండుతో మధుమేహం ఉన్నవారికి ఎన్ని బెనిఫిట్స్ అంటే...!
ABN , Publish Date - May 06 , 2024 | 04:27 PM
ఆహారంలో తగినంత మెగ్నీషియం ఉంటే అది ఎముక సాంద్రతను పెంచుతుంది. వయసు పెరిగే కొద్ది 70 లలో వారికి తగినంత మెగ్నీషియం లభించదు. కానీ చింతపండులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది.
చింతపెట్టు ఆకులు, చిగుర్లు, విత్తనాలు, బెరడు, కలప ఇలా అన్నీ ఉపయోగపడేవే. చింతపండును ఆసియా, మధ్య అమెరికా, ఆఫ్రికా, కరేబియన్ దేశాలు వంటలలో ఉపయోగిస్తున్నాయి. దీనితో చట్నీలు, సాస్లు, క్యాండీలు, పానీయాలు, కూరలు, పచ్చళ్ళు ఇలా ఇది అది అనేమిటి అన్నింటా చింటపండు ఉపయోగిస్తూనే ఉన్నాం. ఒక్క తినేందుకు మాత్రమే కాకుండా చింతచెట్టు భాగాలను అనేక ఆరోగ్య ప్రయోజనాల్లో కూడా వాడుతుంటారు. దీనితో కలిగే ఆరోగ్యప్రయోజనాల లిస్ట్ గురించి కాస్త తెలుసుకుందాం.
చింతపండు గుజ్జులో ఉన్న ఆరోగ్య పోషకాల గురించి తెలుసుకుందాం.
కణజాలం అభివృద్ధికి..
అమైనో ఆమ్లాలు, ప్రోటీన్ శరీరం పెరగడానికి, కణజాల అభివృద్ధికి సరిపోతాయి. చింతపండులోని ట్రిప్టోఫాన్ మినహా అన్ని ముఖ్యమైన ఆమైనో ఆమ్లాలు కణజాలాన్ని పెంచడంలో ప్రధాన పాత్రపోషిస్తాయి.
క్యాన్సర్ రిస్క్ తగ్గుదల..
శాస్తవేత్తలు చెప్పే కారణాలలో యంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందట చింతపండు. అలాగే ఈ యాంటీ ఆక్సిడెంట్లు సెల్ DNAదెబ్బతినకుండా ఫ్రీరాడికల్స్ నిరోధిస్తుంది. మొక్కలలో లభించే బీటా కెరోటిన్ సహా అనేక ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉన్నాయి.
Hearth Health : గుండె నొప్పిని ముందుగానే తెలిపే లక్షణాలు ఎలా ఉంటాయంటే..!
మెదడు ఆరోగ్యం.
బి విటమిన్ పుష్కలంగా చింతపండులో ఉంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని నాడజీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే బి విటమిన్, థయామిన్, ఫోలేట్ పుష్కలంగా ఉన్నాయి. అయితే చింతపండులో బి12 విటమిన్ ఉండదు.
ఎముక పుష్టి..
ఆహారంలో తగినంత మెగ్నీషియం ఉంటే అది ఎముక సాంద్రతను పెంచుతుంది. వయసు పెరిగే కొద్ది 70 లలో వారికి తగినంత మెగ్నీషియం లభించదు. కానీ చింతపండులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఖనిజాల కలయికతో పాటు బరువు మోసే ఎముకల పుష్టికి కూడా తోడ్పడుతుంది. బోలు ఎముక వ్యాధిని, ఎముకలలో వచ్చే పగుళ్లను నిరోధిస్తుంది.
The Heat Wave : వేసవిలో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువ.. ఈ టైంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు ఏవి?
చింతపండులో విటమిన్ డి ఉండదు.
చింతపండులో కేలరీలు చక్కెర రూపంలో ఉంటాయి.
చింతపండును మిఠాయి తీపి పానీయాలలో కూడా వాడతారు.
మధుమేహం, బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.
Read Latest Navya News and Thelugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.