Share News

Cold and Cough : వేసవిలో ఏది తీసుకున్నా జలుబు తప్పడంలేదా.. ఇలా చేసి చూడండి..

ABN , Publish Date - May 10 , 2024 | 04:07 PM

వేసవికాలంలో ఇళ్లలో ఏసిలు ఉండటం వల్ల శరీరంలో పొడిదనం పెరుగుతుంది. ఇది శరీరం పొడిబారణం, ముక్కు, నోటి లోపల పొర కూడా పొడిబారడానికి కారణం కావచ్చు. దీనితో ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. జులుబు, దగ్గు వస్తుంది.

Cold and Cough :  వేసవిలో ఏది తీసుకున్నా జలుబు తప్పడంలేదా.. ఇలా చేసి చూడండి..
Health

వేసవి రావడం అంటే ఎండలు మండిపోతూ ఉంటాయి. ఎటు పోవాలన్నా ఎండ దానితో పాటు వచ్చే చెమట విసిగిస్తాయి. వీటితో పాటు ఎండాకాలం వేడికి ఏది తాగినా జలుబు ఇట్టే చేస్తుంది. వాతావరణంలోని మార్పుకి పెరిగిన ఎండ తాపానికి దాహం పెరుగుతుంది. దీని కారణంగా నీటిని ఎక్కువగా తీసుకోవడం, అది తలబరువు, జలుబు, దగ్గు, డీహైడ్రేషన్, వడదెబ్బ కూడా ఉంటుంది. ఈ చిక్కులన్నీ వెసవి తాపం కారణంగా ఉంటాయి.. మండుతున్న ఎండలు ఉష్ణోగ్రతల కారణంగా డీహైడ్రేషన్, వడదెబ్బకు గురవుతూ ఉంటారు. ఎండవేడికి నీటిని ఎక్కువగా తాగడం కారణం చేత జలుబు, దగ్గుతో బాధపడతారు. వేసవి జలుబు కారణాలు, లక్షణాలను గురించి తెలుసుకుందాం.

వేసవి చలికి కారణాలు.. ఈ సీజన్ లో జలుబు వెనుక ప్రధాన కారణాలు అలెర్జీలు, వైరస్ లు, శుభ్రత లేకపోవడం, శరీరంలోకి చేరిన దుమ్ము అలర్జీలకు కారణం అవుతుంది. ఈ సీజన్ లో బలమైన వేడి గాలులు ఉంటాయి. ఇవి దుమ్ము, పుప్పొడిని తీసకువస్తాయి. ఇవి మన శరీరంలోకి ప్రవేశించినప్పుపడు శరీరం, జలుబు, దగ్గుకు గురవుతుంది.

వేసవికాలంలో ఇళ్లలో ఏసిలు ఉండటం వల్ల శరీరంలో పొడిదనం పెరుగుతుంది. ఇది శరీరం పొడిబారణం, ముక్కు, నోటి లోపల పొర కూడా పొడిబారడానికి కారణం కావచ్చు. దీనితో ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. జులుబు, దగ్గు వస్తుంది. ఇంట్లో ఒకరికి జలుబు చేస్తే.. మిగతావారికీ వస్తుంది.



Health Benefits : చింతపండుతో మధుమేహం ఉన్నవారికి ఎన్ని బెనిఫిట్స్ అంటే...!

వేసవి చలి, లక్షణాలు..

తుమ్ములు, కారుతున్న ముక్కు, రద్దీ, దరద లేదా గొంతు నొప్పి

దుగ్గు,

చెమటలు,

జ్వరం

నివారణ చిట్కాలు..

వేసవిలో జలుబు, దగ్గు,రాకుండా ఉండాలంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్లే ముందు మాస్క్ ధరిస్తే, దుమ్ము ధూళి శరీరంలోకి చేరదు. ఎవరైనా జులుబుతో బాధపడుతుంటే అతడిక సరైన దూరం పాటించండి. దూరం పాటించాలి. దీనితో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 10 , 2024 | 04:11 PM