Share News

Health Tips : వీళ్ళు చెరుకు రసాన్ని అతిగా తాగితే కష్టమే.. ఎందుకంటే..

ABN , Publish Date - Apr 23 , 2024 | 04:43 PM

వేసవి కాలం వచ్చిందంటే ఎండ, వేడి దానితో పాటు దాహం కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనికి అందరూ కూల్ డ్రింక్స్ మీద, కొబ్బరి బొండాలు, సోడాలు, పండ్ల రసాల మీద ఎక్కువగా ఆధారపడతారు. మామూలుగా వేసవి సీజన్ అంతా ఇలాగే జరుగుతూ ఉంటుంది. అయితే శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే చెరుకు రసం కూడా ఈ కాలంలో ఎక్కువగా తీసుకునే పానీయమే.

Health Tips : వీళ్ళు చెరుకు రసాన్ని అతిగా తాగితే కష్టమే.. ఎందుకంటే..
Sugarcane juice

వేసవి కాలం వచ్చిందంటే ఎండ, వేడి దానితో పాటు దాహం కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనికి అందరూ కూల్ డ్రింక్స్ మీద, కొబ్బరి బొండాలు, సోడాలు, పండ్ల రసాల మీద ఎక్కువగా ఆధారపడతారు. మామూలుగా వేసవి సీజన్ అంతా ఇలాగే జరుగుతూ ఉంటుంది. అయితే శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే చెరుకు రసం కూడా ఈ కాలంలో ఎక్కువగా తీసుకునే పానీయమే. దీనితో శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. అంతా ఎంతో ఇష్టంగా తాగే చెరుకు రసం గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. చెరుకు రసం మామూలుగా అందరికీ పడే అవకాశం తక్కువ. దీనిలో తీపి కారణంగా షుగర్ వ్యాధి ఉన్నవారు ఎక్కువగా తాగకూడదు. ఇలా రోజూ కానీ చెరుకు రసాన్ని తీసుకుంటే కొన్ని ఇబ్బందులు తప్పవట అవేమిటో తెలుసుకుందాం.

1. చెరుకు రసంలో అనేక విటమిన్లు పోషకాలు ఉన్నాయి. మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లను పుష్కలంగా కలిగి ఉంది.

2. దీనిలోని ఫైబర్ కారణంగా ఇది శరీరానికి మంచి పోషణను అందిస్తుంది. అయితే చెరుకు రసాన్ని రోజూ క్రమం తప్పకుండా గానీ తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవట.

Healthy Food : బియ్యానికి బదులుగా గోధుమ రవ్వను తీసుకుంటే..!


3. మామూలుగా చెరుకు రసాన్ని స్త్రీలైతే రోజుకు ముప్పావు కప్పు, అదే పురుషులు ఒక కప్పు మాత్రమే తాగాలి. బరువు సమస్య ఉన్నవారు తాగితే ఇంకా బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

4. డయాబెటిస్ ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు కూడా దీనిని తీసుకోకపోవడమే మంచిది. వీళ్ళు గానీ తీసుకుంటే జీర్ణ క్రియ విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

Healthy Food : బియ్యానికి బదులుగా గోధుమ రవ్వను తీసుకుంటే..!


6. చిన్న వయసు పిల్లలు, విటమిన్ సప్లిమెట్లను తీసుకునేవారు, రక్తాన్ని పలుచగా చేసేందుకు మందులు వాడుతున్నవారు కూడా ఈ చెరుకు రసాన్ని అతిగా తీసుకోకూడదు.

7. జీర్ణ శక్తి తక్కువగా జరిగే వారు ముఖ్యంగా తరచుగా కడుపు నొప్పి, విరేచనాలతో ఇబ్బంది పడేవారు చెరుకు రసాన్ని తీసుకోకపోవడం బెటర్..

8. ఎందుకంటే చెరుకు రసం మీద వాలే ఈగలు కారణంగా వీరు ఇట్టే ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 23 , 2024 | 05:56 PM