Healthy Food : బియ్యానికి బదులుగా గోధుమ రవ్వను తీసుకుంటే..!
ABN , Publish Date - Apr 23 , 2024 | 12:29 PM
ఇందులో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ముఖ్యంగా గోధుమ రవ్వలో ఫైబర్, ప్రోటీన్, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్ లో పుష్కలంగా ఉంటాయి. జీర్ణ ఆరోగ్యాన్ని పెంచుతుంది. శక్తి స్థాయిలను కూడా పెంచుతుంది.
తృణధాన్యాలను అన్నానికి బదులుగా ఆహారంలో తీసుకోవాలని చూస్తూ ఉంటాం. మధుమేహం ఉన్నవారు ఎక్కువగా బ్రౌన్ రైస్ తీసుకుంటూ ఉంటారు. అలాగే రాత్రి భోజనానికి అన్నం తగ్గించి చపాతీలను, పుల్కాలను తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వీరు గోధుమ రవ్వ తీసుకుంటే ఇందులో ఫైబర్, ప్రోటీన్, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ ఆరోగ్యాన్ని, శక్తి స్థాయిలను కూడా పెంచుతాయి. గోధుమ రవ్వ శరీరక విధులకు మద్దతుగా నిలుస్తుంది. గోధుమ రవ్వను(Bulgur) తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.
బరువు తగ్గేందుకు..
ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి, గోధుమ రవ్వలోని (Bulgur) అధిక ఫైబర్ కంటెంట్ పనిచేస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. అతిగా తినడం కంట్రోల్ కాగానే బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఇందులోని సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు శక్తిని అందిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది.
గోధుమ రవ్వతో(Bulgur) ఆరోగ్యకరమైన జీర్ణ క్రియ..
జీర్ణ సంబంధమైన సమస్యలను తగ్గిస్తుంది. ఫైబర్ కారణంగా పేగు కదలికలను నియంత్రిస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
ఎముకల ఆరోగ్యానికి..
గోధుమ రవ్వలో (Bulgur) మెగ్నీషియం, భాస్వరం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. ఇవి బలమైన, ఆరోగ్యకరమైన ఎముకలకు మద్దతు ఇస్తుంది.
Sleep Changes: మహిళల్లో నిద్ర లేమి సమస్యలు ఎందుకు వస్తాయంటే..!
యాంటీఆక్సిడెంట్ లక్షణాలు..
విటమిన్ ఇ, బి లతో సహా యాంటీ ఆక్సిడెంట్లు గోధుమ రవ్వలో పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవటానికి క్యాన్సర్, హృదయ సంబంధమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగ పడతాయి.
Read Latest Navya News and Thelugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.