Healthy Food : ఈ ధాన్యాలు మన తెల్ల బియ్యానికి ప్రత్యామ్నాయాలు.. వీటితో ఎంత ఆరోగ్యమో..!
ABN , Publish Date - May 25 , 2024 | 03:58 PM
తృణధాన్యాలతో పోల్చితే బియ్యంలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ కూడా తక్కువగా ఉంటాయి. కొన్ని రకాల ధాన్యాలలో పోషకాలు బావుంటాయి. ఇవి తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా చాలా సంస్కృతులలో బియ్యం ప్రధానమైన ఆహారంగా ఉంటూ వస్తుంది. అయితే తృణధాన్యాలతో పోల్చితే బియ్యంలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ కూడా తక్కువగా ఉంటాయి. కొన్ని రకాల ధాన్యాలలో పోషకాలు బావుంటాయి. ఇవి తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది.
వైట్ రైస్‌కు అనేక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలున్నాయి.. అవి..
బ్రౌన్ రైస్..
బ్రౌన్ రైస్ అనేది తృణధాన్యం. ఇది ఫైబర్, విటమిన్లు, ఖనిజాల మంచి మూలం. బ్రౌన్ రైస్, వైట్ రైస్ కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరడానికి కారణం అవుతాయి.
క్వినోవా..
క్వినోవా అనేది పూర్తి ప్రోటీన్. ఇందులో మెగ్నీషియం, ఫైబర్, ఐరన్, జింక్ వంటి పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. క్వినోవా తేలికపాటి, రుచికరమైన ఆహారం.
కాలీఫ్లవర్ రైస్..
కాలీఫ్లవర్ రైస్ కూడా కార్బ్, తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. ఇందులో ఫైబర్, విటమిన్ సి ఉంటాయి.
Drinking pomegranate juice : గుండె ఆరోగ్యాన్ని పెంచే దానిమ్మకాయ, రసం ఏది తీసుకున్నా బోలెడు బలం..!
వైల్డ్ రైస్..
అడవి బియ్యం ఇవి ఒక రకమైన గడ్డి నుంచి వస్తాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. సూప్, సలాడ్ లలో ఈ రైస్ బావుంటుంది.
బార్లీ..
బార్లీ అనేది ఫైబర్, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే తృణధాన్యం. ఇది కోలస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యం ఇది.
బుల్గుర్ గోధుమ..
ఈ గోధుమ ఉడకబెట్టి, ఎండబెట్టి తర్వాత పగిలిన ధాన్యాన్ని వండేందుకు ఉపయోగిస్తారు. గోధుమలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉన్నాయి.
Summer Halth Tips : ఎండలోంచి రాగానే నీరు తాగేస్తున్నారా.. అలా అయితే ఈ ఇబ్బంది తప్పదు.. !
ఫారో..
ఫారో అనేది గోధుమల జాతికి చెందినది. ఈ ధ్యాన్యం రుచిగా ఉంటుంది. ఫారో ప్రోటీన్, ఫైర్, విటమిన్లు కలిగి ఉంటుంది.
చిక్పీ రైస్..
చిక్ పీ రైస్ అనేది కొత్త రకంగా ఉంటాయి, ఈ బియ్యం ముక్కలుగా ఉండి ప్రోసెస్ ద్వారా తయారవుతాయి. దీనిలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు ఉంటాయి. వీటిని వైట్ రైస్ కు ప్రత్యామ్నాయంగా వాడతారు.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.