Share News

Health Tips : రంగు మారిన గోళ్లు మన అనారోగ్యాన్ని ఇట్టే చెబుతాయట.. ! అదెలాగంటే..

ABN , Publish Date - Apr 22 , 2024 | 02:46 PM

ఆరోగ్యకరమైన, బలమైన, మృదువైన గోళ్లు గులాబీరంగులో ఉంటాయి. రంగు మారడం, గట్టిపడటం, మృదువుగా మారడం, రిడ్జింగ్, గుంటలు ఇలా ఉంటే కనుక అవి అంతర్లీన ఆరోగ్య పరిస్థితులకు సంకేతాలు కావచ్చు.

Health Tips : రంగు మారిన గోళ్లు మన అనారోగ్యాన్ని ఇట్టే చెబుతాయట.. ! అదెలాగంటే..
Your Nails

గోళ్లు పెంచుకోవడం అందరికీ సరదాగా ఉంటుంది. వీటికి రకరకాల నెయిల్ పాలిష్ వేసుకుని మురిసిపోతూ ఉంటాం. అయితే గోళ్లు ఆరోగ్యంగా ఉంటే శరీరంలో ఎలాంటి ఇబ్బందులు లేనట్టేనట.. గోళ్లు చాలా వరకూ మన ఆరోగ్యం గురించి చెబుతాయట. మన శరీరంలో అన్ని భాగాలు ఆరోగ్యంగా ఉన్నట్టు సంకేతాలను గోళ్ల చూసి తెలుసుకోవచ్చట. అదే ఆరోగ్యం బాగా లేదని చెప్పాలంటే ఎలాంటి సంకేతాలుంటాయో చూద్దాం.

ఆరోగ్యకరమైన, బలమైన, మృదువైన గోళ్లు గులాబీరంగులో ఉంటాయి. రంగు మారడం, గట్టిపడటం, మృదువుగా మారడం, రిడ్జింగ్, గుంటలు ఇలా ఉంటే కనుక అవి అంతర్లీన ఆరోగ్య పరిస్థితులకు సంకేతాలు కావచ్చు.

సంకేతాలు..

1. గోళ్లు పాలిపోయినట్టు, పలుచగా ఉంటే ఆహారంలో ఇనుము శాతం తక్కువగా ఉన్నట్టు లెక్క. ఇనుము లేకపోవడం వలన శరీరంలో ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది. దీనికి ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. మాసం, చేపలు తీసుకోవాలి.


2. పాలిపోయినట్టుగా గోళ్లు ఉంటే ఇవి శరీరంలో రక్తహీనతకు సంకేతంగా చెప్పవచ్చు. ఎర్రరక్తకణాలు లేకపోవడం వల్ల అలసట ఎక్కువగా ఉంటుంది.

Sleep Changes: మహిళల్లో నిద్ర లేమి సమస్యలు ఎందుకు వస్తాయంటే..!

3. గోళ్లు నీలంగా ఉన్నట్టు టోన్ గమనిస్తే, ఇది ఇన్సులిన్ లోపం వల్ల కనిపించే సంకేతం. లేదంటే డయాబెటిస్ కావచ్చు.

4. గోళ్లు పాలిపోయినట్టుగా కనిపిస్తూ, తెల్లని చారలు కనిపిస్తే, తీసుకునే ఆహారంలో ప్రోటీన్ లేదని సంకేతం. ఆహారంలో ప్రోటీన్ పెంచటానికి లీన్ మాంసాలు, నట్స్, ఆకుపచ్చ కూరగాయలు, సోయా, సీడ్స్, చల్లని నీటి చేపలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ తెల్లని మచ్చలు మూత్రపిండాలు, కాలేయ వ్యాధులకు కూడా సంకేతం కావచ్చు.


Drinking water : రోజులో ఎవరు ఎంత నీటిని తీసుకోవాలి?

5. అదే గోళ్లు పసుపు రంగులో ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ని సూచిస్తుంది. గోళ్లు పసుపుగా ఉంటే ఎంఫిసెమా, ఊపిరితిత్తుల సమస్యలకు కారణం కావచ్చు.

6. గోళ్లు ఎరుపు రంగులోకి మారి కనిపిస్తే.. ఇది గుండెకు సంబంధించిన సమస్యకు సంకేతం కావచ్చు. గుండె ఆరోగ్యాన్ని పెంచాలంటే ప్రాసెస్ చేసిన కొవ్వులను తీసుకోవడం తగ్గించాలి.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 22 , 2024 | 02:58 PM