Share News

Side Effects : మామిడి పండ్లను అతిగా తింటే ఈ 7 సైడ్ ఎఫెక్ట్స్ కలగడం ఖాయం..!

ABN , Publish Date - Jun 26 , 2024 | 12:04 PM

మామిడి పండ్లను అదేపనిగా తీసుకోవడం వల్ల దురద, వాపు, దద్దుర్లు, అనాఫిలాక్సిస్ వంటి లక్షణాలు కనిపిస్తే వైద్య సహాయం తీసుకోవడం మంచిది.

Side Effects : మామిడి పండ్లను అతిగా తింటే ఈ 7 సైడ్ ఎఫెక్ట్స్ కలగడం ఖాయం..!
side effects

మామిడి పండ్లంటే ఎవరికి ఇష్టం ఉండదు. అంతా చాలా ఇష్టంగా తినే పండ్లలో మామిడి పండ్లు ఒకటి. సంవత్సరంలో ఎక్కువగా దొరికే పండ్లలో మామిడి కాయలు పిల్లలకు, పెద్దలకు అందరికీ ఇష్టమే. అయితే మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఇబ్బందులు కూడా తప్పవు. వీటితో జీర్ణక్రియ సమస్యలు, పొత్తికడుపులో తిమ్మిరి, విరేచనాలువంటి జీర్ణ క్రియ సంబంధమైన ఇబ్బందులతో పాటు.. ఇంకా ఎలాంటి సమస్యలు ఉంటాయో చూద్దాం.

జీర్ణక్రియ

మామిడి పండ్లు అధికంగా తీసుకుంటే ఇందులోని అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా ఉబ్బరం, గ్యాస్, పొత్తికడుపు తిమ్మిరి, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు. జీర్ణక్రియ బలహీనం అవుతుంది.

బరువు పెరుగుతారు.

అధికంగా మామిడి పండ్లను తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందులోని అధిక కేలరీలు శరీరంలో బరువు పెరిగేలా చేస్తాయి.

అలెర్జీలు..

మామిడి పండ్లను అదేపనిగా తీసుకోవడం వల్ల దురద, వాపు, దద్దుర్లు, అనాఫిలాక్సిస్ వంటి లక్షణాలు కనిపిస్తే వైద్య సహాయం తీసుకోవడం మంచిది.


Boosts Immunity : ఉల్లిపాయను పచ్చిగానే తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?

బ్లడ్ షుగర్ లెవల్స్..

మామిడిపండ్లను ఎక్కువగా తీసుకుంటే చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. మధుమేహం ఉన్నవారికి లేదా ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉన్నవారికి సమస్యాత్మకంగా ఉంటుంది.

విటమిన్ ఎ టాక్సిసిటీ..

మామిడి పండ్లు విటమిన్ ఎ అద్భుతమైన మూలం. అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో పోషకం అధికంగా ఉంటుంది. దీనితో హైపర్ విటమినోసిస్ ఎ అనే పరిస్థితి ఏర్పడుతుంది. విటమిన్ ఎ విషపూరితం లక్షణాలు మైకం, వికారం, దృష్టిలోపం, జుట్టు రాలడం వంటి సమస్యలుంటాయి.

Weight Loss: ఒక్క జీర్ణక్రియకే కాదు, బరువు తగ్గడంలోనూ వాము బాగా పనిచేస్తుంది..!

చికాకు..

మామిడి పండ్లలో ఉరుషియోల్ అనే పదార్థం కారణంగా పోయిజన్ ఐవీ, పాయిజన్ ఓక్ ఉంటాయి. ఇవి మామిడి పండ్లు తిన్న తర్వాత నోటిలో లేదా పెదవులపై చికాకుగా ఉండి దురదలా ఉంటుంది. మామిడి పండ్ల పై తోలును సరిగా క్లీన్ చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి ఉంటుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 26 , 2024 | 12:04 PM