Superfoods For Kids : చదువుకునే పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ 9 సూపర్‌ఫుడ్స్ తీసుకుంటే చాలు..
ABN , Publish Date - Jul 04 , 2024 | 12:11 PM
జ్ఞాపకశక్తి పెంచే, మెదడు చాలా ఆకలితో ఉండే అవయవం. మనం తినే ఆహారం నుండి పోషకాలను గ్రహిస్తుంది.
పిల్లల తెలివితేటలు, శరీర ఎదుగుదల బావుంటేనే తల్లిదండ్రులు సంతోషంగా, తృప్తిగా ఉంటారు. దీనికోసం సమతుల్య ఆహారాన్ని అందిస్తారు కానీ.. జ్ఞాపకశక్తి, మెదడు చాలా ఆకలితో ఉండే అవయవం. మనం తినే ఆహారం నుండి పోషకాలను గ్రహిస్తుంది. జింక్ అధికంగా తీసుకోవడం మెదడు ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి సూపర్ ఫుడ్స్ పిల్లల్లో ఆరోగ్యంతో పాటు తెలివితేటలను పెంచేవి కూడా తీసుకుంటూ ఉండాలి. పిల్లల చదువులు, ఆటలు, వాటి మధ్య మెదడు ఆరోగ్యం, జ్ఞాపకశక్తి కోసం తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..
సాల్మన్ చేప.. కొవ్వు చేపలు సాల్మన్, మాకేరెల్ వంటివి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ముఖ్యంగా DHA, ఇది జ్ఞాపకశక్తి, కంటి చూపు, మొత్తం మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
గుడ్లు.. గుడ్లలో ప్రోటీన్, కోలిన్ ఉంటాయి. ఇవి జ్ఞాపకాలను ఏర్పరచడంలో సహాయపడుతుంది. గుడ్లు ఎక్కువగా తీసుకోవాలి.
Rainy Season : వానాకాలం ఈ శుభ్రత పాటిస్తున్నారా.. లేదంటే వ్యాధులు తప్పవ్..!
వేరుశనగ.. మెదడు, నాడీ వ్యవస్థకు శక్తి కోసం గ్లూకోజ్ ఉపయోగించాలి. థమిమిన్ తోపాటు విటమిన్ ఇ ఉంటాయి. ఇందులోని న్యూరోనల్ పొరలను సంరక్షించే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి.
వోట్స్.. పిల్లల కోసం ఆరోగ్యాన్ని అందించే తృణధాన్యాలలో మొదటిది వోట్స్ ఇది మెదడు ఆరోగ్యాన్ని, శక్తిని అందిస్తుంది. ఓట్స్ లోని అధిక ఫైబర్ కంటెంట్ పిల్లలకు మెదడుకు మంచి ఇంధనంగా పనిచేస్తుంది. పొటాషియం, జింక్, విటమిన్ ఇ, బి ఇవి మంచి పెరుగుదలకు సహకరిస్తాయి.
బెర్రీలు.. బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, చెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇవి రకరకాల రంగులలో ఎక్కువ పోషకాలను కలిగి ఉన్నాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
Super Food : ఎర్ర రైస్ చేసే మేలు ఏమిటి.. దీనిని తీసుకుంటే..
బీన్స్.. బీన్స్ ప్రత్యేకమైనవి. ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్ శక్తితో పాటు విటమిన్లు, ఖనిజాలు కలిగి ఉంటాయి. మానసికమైన సామర్థ్యాన్ని ఇస్తాయి. మెదడుకు బీన్స్, పింటో బీన్స్ ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యంలో ముఖ్యంగా పనిచేస్తాయి.
పండ్లు, కూరగాయలు.. ఆరోగ్యకరమైన దృఢమైన మెదడు కణాలను నిర్వహించే యాంటీ ఆక్సిడెంట్లు టమాటాలు, చిలకడ దుంపలు, గుమ్మడికాయ, క్యారెట్లు, బచ్చలికూర, పాలకూర వంటి కూరగాయలు సూపర్ ఫుడ్స్ గా మారి మెదడు పనితీరులో జ్ఞాపకశక్తిని పెంచే విధంగా పనిచేస్తాయి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.