Share News

Eat One Amla Daily : ప్రతి రోజూ ఒక ఉసిరికాయ తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..

ABN , Publish Date - Jun 01 , 2024 | 04:08 PM

ఉసిరి అనేక వ్యాధులకు చెక్ పెడుతుంది. ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మ, నారింజ, ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి ఫ్రీరాడికల్స్ అని పిలిచే హానికరమైన అణువుల నుంచి మనల్ని రక్షిస్తాయి.

Eat One Amla Daily : ప్రతి రోజూ ఒక ఉసిరికాయ తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..
Health Benefits

ఉసిరి కాయ మన ఆయుర్వేదంలో ముఖ్యమైన ఔషధంగా ఉపయోగిస్తూ ఉంటాం. ఎన్నో పోషకాలను తనలో దాచుకున్న శక్తి బూస్టర్ ఆమ్లా. ఇది చేదు నుంచి పులుపు వరకూ అనేక రుచుల కలయికతో ప్రత్యేకంగా ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఉసిరి అనేక వ్యాధులకు చెక్ పెడుతుంది. ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మ, నారింజ, ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి ఫ్రీరాడికల్స్ అని పిలిచే హానికరమైన అణువుల నుంచి మనల్ని రక్షిస్తాయి.

జీవక్రియను మెరుగుపరుస్తాయి. వైరస్, బ్యాక్టీరియా వ్యాధులను అడ్డుకుంటుంది. ఇది క్యాన్సర్, గుండె సమస్యలను పెరగనీయదు. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు ఊపిరి అద్భుతమైన హోం రెమెడీ.

మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

ఉసిరి పోషకాహార వనరుగా పనిచేస్తుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ తో కూడి పుల్లని పండు. సాంప్రదాయ వైద్యంలో ఉసిరిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. రోగనిరోధక ఆరోగ్యాన్ని పెంచుతుంది.

విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది..

ఉసిరి, గూస్బెర్రీ, విటమిన్ సి ఇన్ఫెక్షన్లను వ్యతిరేకంగా శరీరాన్ని రక్షిస్తుంది.


Expensive Foods : భారతదేశంలో లభించే 5 అత్యంత ఖరీదైన ఆహారాలు..

యాంటీ ఆక్సిడెంట్..

ఆమ్లా పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు, టానిన్‌లతో సహా యాంటీ ఆక్సిడెంట్ లతో నిండి ఉంటుంది.

జీవక్రియను మెరుగుపరుస్తుంది.

ఉసిరిలో ఫైబర్ ఉంటుంది. జీర్ణక్రియకు సహకరిస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పేగు ఆరోగ్యాన్ని పెంచుతుంది.

జీవక్రియను పెంచుతుంది.

ఆమ్లాలోని అధిక విటమిన్ సి కంటెంట్ జీవక్రియను పెంచుతుంది. బరువును తగ్గిస్తుంది.


Symptoms Of Typhoid: టైఫాయిడ్ సంకేతాలు, లక్షణాలు ఎలా ఉంటాయంటే..

చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది.

ఆమ్లా యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. సహజమైన మెరుపును అందిస్తుంది.

జుట్టు ఆరోగ్యం..

ఉసిరి జుట్టు ఆరోగ్యాన్ని పెంచి, కుదళ్లను బలపరుస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలు..

ఉసిరి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సామర్థ్యాన్ని చూపుతుంది. మధుమేహం ఉన్న వ్యక్తులకు రక్తంలో గ్లూకోజ్ ప్రయోజనాలను పెంచుతుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 01 , 2024 | 04:08 PM