Herbs And Spices : కిడ్నీ, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే మూలికలు, సుగంధ ద్రవ్యాలు ఇవే..
ABN , Publish Date - Jun 27 , 2024 | 11:18 AM
సుగంధ ద్రవ్యాలు, మూలికలు ఆహారం రుచిని, వాసనను మెరుగుపరుస్తాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కిడ్నీ వ్యాధులను అరికట్టడానికి ఉపయోగపడే మూలికలు..
శరీరంలో మూత్రపిండాలు, కాలేయం (kidney, liver Healthy) ఒక నిర్థిష్ట వడపోత యంత్రాంగంగా పనిచేస్తాయి. మూత్రం మూత్ర పిండాల ద్వారా ఉత్పత్తి చేయబడి, రక్తంలోని వ్యర్థాలను ఫిల్టర్ చేస్తుంది. ఇది రక్తంలోని అనేక రసాయనాలు, మూత్రపిండాల ద్వారా నియంత్రిస్తాయి. అందుకే మూత్రపిండాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. దీనికి సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం. కొన్ని శరీరక శ్రమలు చేయడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికలు మన మూత్రపిండాల ఆరోగ్యాన్ని పెంచుతాయి. దీనికి కొన్ని మూలికలను చేర్చడం ద్వారా ఆరోగ్యంగా ఉంచుతాయి. అవి ఆయుర్వేదంలో మూత్రపిండాల పనితీరుకు సహకరించే సుగంధ ద్రవ్యాలు ఇవే..
దీర్ఘకాలిక మూత్రపిండాల వైఫల్యంతో బాధపడేవారికి క్రియేటినిన్, బ్లడ్ యూరియా, యూరిన్ అల్బమిన్ స్థాయిలను తగ్గిస్తుందని చూపిస్తుంది.
కిడ్నీ, కాలేయ ఆరోగ్యానికి మూలికలు, సుగంధ ద్రవ్యాలు..
సుగంధ ద్రవ్యాలు, మూలికలు ఆహారం రుచిని, వాసనను మెరుగుపరుస్తాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కిడ్నీ వ్యాధులను అరికట్టడానికి ఉపయోగపడే మూలికలు..
Cardamom : యాలకులు తినడం వల్ల కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
గిలోయ్.. ఇది అఫ్లాటాక్సిన్ వల్ల కిడ్నీలో విషపూరితం కాకుండా కిడ్నీలను రక్షిస్తుంది. ఇందులో ఆల్కలాయిడ్స్ ఉండటమే దీనికి కారణం. గిలోయ్ యాంటీఆక్సిడెంట్ గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది ఫ్రీరాడికల్స్ ను నాశనం చేస్తుంది. దీనితో మూత్రపిండాలు దెబ్బతినకుండా ఉంటాయి.
పసుపు.. పసుపు T2DM రోగులలో క్రియోటినిన్ స్థాయిలను తగ్గిస్తుంది. మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. నిద్రపోయే ముందు పసుపు పాలను తీసుకుంటే మంచిది. వెచ్చని పాలు కొంచెం తేనె కలిపి తీసుకోవాలి.
Health Benefits : గుమ్మడికాయ గింజలు తింటే 6 విధాలుగా ఆరోగ్యాన్ని పొందవచ్చు.
అల్లం.. అల్లంలోని యాంటీ ఇన్ప్లమేటరీ ఎఫెక్ట్ ఇన్ఫెక్షన్ లను మూత్రపిండాలలో వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
త్రిఫల.. మూత్రపిండాల సహజ పనితీరును మెరుగుపరచడంలో త్రిఫల ఒక అద్భుతమైన మూలికా చూర్ణం. ఇది కాలేయం, మూత్రపిండాలాలను బలోపేతం చేస్తుంది. శరీరంలో నుంచి విషాన్ని తొలగించడానికి మంచి ఔషధం.
అమలకి, హరితకీ, బిభితక్.. ఇవి అద్భుతమైన త్రయం, అమలాకీ, హరిటాకి, బిభిటాకి ప్రకృతిలో లభించే సహజమైన నివారణలు. మెరుగైన ప్లాస్మాప్రోటీన్లు, అల్బుమిన్, క్రియేటినిన్, మొత్తం మూత్రపిండ పనితీరును మెరుగుపరుస్తుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.