Share News

Women Health : మోనోపాజ్ 40లలోనే వచ్చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి.

ABN , Publish Date - Jun 26 , 2024 | 01:37 PM

35 సంవత్సరాలు దాటిన స్త్రీలు మమోగ్రామ్, పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. తరచుగా లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్, బీపీ పరీక్షలు చేయించుకోవాలి. మోనోపాజ్ వచ్చిన తరువాత ప్రతి 5 ఏండ్లకు ఒకసారి ఎముకల సాంద్రత పరీక్షలు కూడా తప్పనిసరి.

Women Health : మోనోపాజ్ 40లలోనే వచ్చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి.
Early Menopause

మోనోపాజ్ ఆడవారిలో నెలసరి ఆగిపోయే క్రమాన్ని ఇలా పిలుస్తారు. స్త్రీలలో పునరుత్పత్తి శక్తి ఆగిపోయిందని సూచించే క్రమం ఇది. మోనోపాజ్ ముందు కొన్ని లక్షణాలు ఇవి. ఈ సమస్యను పసిగట్టి ముందు జాగ్రత్తలు తీసుకుంటే తక్కువ వయసులోనే మోనోపాజ్ వైపు వెళ్ళకుండా ఉంటుంది. 50 సంవత్సరాలు దాటిన తర్వాత రావాల్సిన మోనోపాజ్ ముందుగానే 40లలో ఉండగానే రావడానికి ముఖ్య కారణం సరైన జీవనశైలి అలవాట్లు లేకపోవడం కారణంగానే జరుగుతుంది.

స్త్రీలలో నడివయసులో ఉండగానే మానసికంగా, శారీరకంగా వీక్ గా తయారవుతారు. వీళ్లలో పిరియడ్స్ సమస్యగా మారి నెమ్మదిగా మోనోపాజ్ వరకూ వెళుతుంది. 40లలోనే మోనోపాజ్ కు చేరడం వల్ల కలిగే అనర్థాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చికిత్సలు గురించి తెలుసుకుందాం.

సాధారణంగా ఆడ బిడ్డ పుట్టుకతోనే 12 లక్షల నుంచి 20 లక్షల అండాలతో జన్మిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ అండాల సంఖ్య తగ్గుతూ వస్తుంది. బుతుక్రమం మొదలైన నాటి నుంచి కొన్ని అండాలు విడుదలవుతూ నిల్వక్రమంగా తగ్గుతూ వస్తుంది. మోనోపాజ్ దశకు చేరుకునే సరికి అండాల విడుదలతో పాటు హార్మోన్ల విడుదల కూడా ఆగిపోతుంది. మోనోపాజ్ స్త్రీలలో పునరుత్పత్తి నిలిచిపోవడానికి సంకేతంగా చెప్పవచ్చు.

Side Effects : మామిడి పండ్లను అతిగా తింటే ఈ 7 సైడ్ ఎఫెక్ట్స్ కలగడం ఖాయం..!

మోనోపాజ్ కు 5 నుంచి 7 సంవత్సరాల ముందు నుంచే శరీరంలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. వీటిల్లో ముఖ్యంగా హార్మోన్ల స్థాయి క్రమంగా తగ్గుతుంది. పీయూష గ్రంథి నుంచి గొనడోట్రోపిన్ వంటి హార్మోన్లు అధికంగా విడుదల అవుతాయి. ఫలితంగా శరీరక మార్పులు జరిగి మోనోపాజ్ దశకు చేరుకుంటారు. ఈ పరిస్థితి 47 సంవత్సరాల నుంచి 53 సంవత్సరాల మధ్య ఏర్ఫడుతుంది. ఇక 40 సంవత్సరాలలోనే మోనోపాజ్ రావడాన్ని ప్రిమెచ్యూర్ మోనోపాజ్ అంటారు.

ముందుగానే మోనోపాజ్..

జన్యులోపం

వంశపారంపర్యం

ఫర్టిలిటీ చికిత్స

జంక్ ఫుడ్

వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం

బరువు పెరుగడం

ధూమపానం

మాదక ద్రవ్యాల వినియోగం

లక్షణాలు..

కాల్షియం తగ్గిపోవడం

నెలసరి క్రమం తప్పడం

రెండు మూడు నెలలకు ఒకసారి నెలసరి ఉండటం

తీవ్ర రక్తస్రావం లేదా అతి తక్కువగా ఉండటం

మానసిక ఒత్తిడి పెరగడం

అసహనం, చికాకు

కీళ్ల నొప్పులు

నీరసం, అలసట

తల, మెడ, ఛాతీ దగ్గర చర్మం ఎర్రగా మారడం

చెమట ఎక్కువగా పట్టడం

జుట్టు రాలడం


Boosts Immunity : ఉల్లిపాయను పచ్చిగానే తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?

సమస్యలు..

ఎముకల్లో కాల్షియం తగ్గిపోతుంది.

విటమిన్ డి తగ్గడం

బీపీ కొలెస్ట్రాల్ పెరుగుతుంది

మానసిక ఒత్తిడి, నిద్రలేమి

హాట్ ఫ్లాషెస్

ఎముకల బలహీనత

మూత్ర వ్యవస్థ,జననేంద్రియాలపై ప్రభావం

మోని, మూత్రనాళం,మూత్ర కోశాల్లో ఈస్ట్రోజెన్ తగ్గుదల

మూత్రనాళ ఇన్ఫెక్షన్

గుండెపాటు ముప్పు పెరుగుతుంది.

35 సంవత్సరాలు దాటిన స్త్రీలు మమోగ్రామ్, పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. తరచుగా లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్, బీపీ పరీక్షలు చేయించుకోవాలి. మోనోపాజ్ వచ్చిన తరువాత ప్రతి 5 ఏండ్లకు ఒకసారి ఎముకల సాంద్రత పరీక్షలు కూడా తప్పనిసరి.


Weight Loss: ఒక్క జీర్ణక్రియకే కాదు, బరువు తగ్గడంలోనూ వాము బాగా పనిచేస్తుంది..!

తీసుకోవాల్సిన ఆహారం..

మోనోపాజ్ దశకు చేరుకున్నవారు సోయాబీన్స్ ఉత్పత్తులు, యాంటీ ఆక్సిడెంట్లు, అధిక మోతాదులో ఉండే తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. టమాటా, గుమ్మడి, క్యారెట్, బొప్పాయిలో క్యాన్సర్ నిరోధక మూలకాలుంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలను తీసుకుంటూ ఉండాలి.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 26 , 2024 | 01:37 PM