Mint Leaves : పుదీనా ఆకులతో ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు ఇవే ..!
ABN , Publish Date - Jun 12 , 2024 | 04:42 PM
పుదీనా ఆకు ఉండే మెంథాల్ లో సహాజసిద్ధమైన డీకాంగెస్టెంట్ గుణాలున్నాయి. ఇవి శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. పుప్పొడి, ధూళి కారణంగా వచ్చే అలెర్జీలు, శ్వాస కోశ సమస్యలను తగ్గిస్తుంది పుదీనా.
పుదీనా ప్రత్యేకమైన వాసవతో ఉంటుంది. మింట్ రుచి, సువాసన తెలియని వారు ఉండరు. పుదీనా ఆరోగ్యపరంగా మంచి సపోర్ట్ ఇస్తుంది. తోటకూర, గోంగూర, బచ్చలి కూరలానే పుదీనా కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. చర్మ ఆరోగ్యానికి మెరుగుపరచడం వరకు పుదీనా ఆకుల ఐదు ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు తెలుసుకుందాం.
రిఫ్రెష్ ప్రభావం..
పుదీనా ఆకులు వేడి నుంచి తట్టుకునేలా చేస్తాయి. శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి చక్కని పరిష్కారంగా పనిచేస్తాయి. పుదీనా ఆకులు జీర్ణ ఎండజైలను ప్రేరేపిస్తాయి. అజీర్ణం, ఉబ్బరం, కడుపు సమస్యలను తగ్గించడానికి పుదీనా మంచి పరిష్కారం.
శ్వాస ఇబ్బందులు..
పుదీనా ఆకు ఉండే మెంథాల్ లో సహాజసిద్ధమైన డీకాంగెస్టెంట్ గుణాలున్నాయి. ఇవి శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. పుప్పొడి, ధూళి కారణంగా వచ్చే అలెర్జీలు, శ్వాస కోశ సమస్యలను తగ్గిస్తుంది పుదీనా.
హైడ్రేషన్ శరీరంలో నీటి శాతాన్ని తగ్గించకుండా మేంటెన్ చేయడంలో పుదీనా మంచి ఎంపిక. నీటి కొరత లేకుండా పుదీనా శరీరాన్ని హైడ్రేషన్ గా ఉంచుతుంది.
చర్మ ఆరోగ్యానికి
అధిక వేడి నుంచి, సూర్య రశ్మి నుంచి చర్మాన్ని కాపాడుతుంది. దద్దుర్లు, వడదెబ్బ, మొటిమలు వంటి సమస్యలు పుదీనాతో దూరం అవుతాయి. ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చికాకు కలిగించే చర్మం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
Mango seeds : మామిడి కాయలు తిని టెంకలు పారేస్తున్నారా? వీటితో ఎన్ని లాభాలో తెలుసా..!
వేసవిలో..
పుదీనా జీర్ణక్రియకు, శ్యాసకోశ ఉపశమనానికి, హైడ్రేషన్ బూస్టర్ గానూ, చర్మ ఆరోగ్యాన్ని పెంచే విధంగానూ పనిచేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యం మొత్తం మంచి ప్రభావానికి లోనవుతుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.