Share News

Health Benefits : టమాటా జ్యూస్ ఉదయాన్నే తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..!

ABN , Publish Date - Apr 29 , 2024 | 04:04 PM

టమాటా రసంలో కొవ్వు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. 95 శాతం నీరు, 5 శాతం పిండి పదార్థాలతో పాటు ఫైబర్, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

Health Benefits : టమాటా జ్యూస్ ఉదయాన్నే తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..!
Health Benefits

వంటలకు ప్రత్యేకమైన రుచిని తెచ్చే వాటిలో మొదటిగా నిలిచేది టమాటాలు మాత్రమే.. ఏడాదిలో అప్పుడప్పుడూ తప్పితే పెద్దగా రేటు ఉండవు. మరీ ఫిరంగా అమ్మితే టమాటా ఇక కొద్ది రోజులు కూరల్లో ఉండదనే బాధ అందరిలోనూ కనిపించేస్తూ ఉంటుంది. ఒకప్పుడు తక్కువగా తినే మనం ఇప్పుడు ప్రతి కూరలోనూ టమాటాను వేసుకోనిదే తినలేం. చాలా చవకగా కేజీ పది రూపాయల్లో దొరికే కాలం కూడా ఎక్కువగానే ఉంటుంది. టమాటాలకు సీజన్తో సంబంధం ఉండదు. ఏ కాలమైనా బోలెడు కాయలు. ఇక రెండు గింజలు చల్లితే మొక్క కూడా చాలా సులువుగా పెరుగుతుంది. అయితే టమాటా రసాన్ని ముఖానికి పట్టించుకుని చర్మం కాస్త ఆరాకా ముఖం కడుక్కుంటే చర్మ నిగారింపు కూడా పెరుగుతుందట.

టమాటా జ్యూస్ తాగితే..

1. టమాటా జ్యూస్ నుంచి విడుదలయ్యే డాటాక్సీ ఫైయర్ శరీరంలోని చెడును బయటకు పంపుతుంది. ఖాళీ కడుపుతో ఈ రసాన్ని తీసుకుంమటే జీర్ణ వ్యవస్థని శుభ్రపరుస్తుంది.

2. ఇందులోని పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్ జీర్ణ క్రియను సులువుగా జరిగేట్టు చేస్తుంది.

3. టమాటారసం తీసుకోవడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల్లో బరువును నియంత్రించడం కూడా ఒకటి. దీనితో రోజూ తీసుకునే అధిక కేలరీలను తగ్గించవచ్చు.

Healthy Food : బియ్యానికి బదులుగా గోధుమ రవ్వను తీసుకుంటే..!


4. టమాటా రసంలో కొవ్వు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. 95 శాతం నీరు, 5 శాతం పిండి పదార్థాలతో పాటు ఫైబర్, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

5. టమాటా రసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కప్పు రసానికి 170MG విటమిన్ సి ని అందిస్తుంది.

6. టమాటా జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయట. అవేంటో చూద్దాం.

వేసవిలో మారేడు జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా.. ?


7. టమాటాలో విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ఖనిజాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియను పెంచుతుంది.

8. ఈ జ్యూస్ పరగడుపునే తాగితే బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో కేలరీలు తీసుకోవడం కూడా సపోర్ట్ చేస్తుంది.

9. టమాటాలు పుల్లగా ఉండేందుకు గల కారణం అందులో ఉన్న ఆల్కలీన్ కారణం. ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో పీహెచ్ బ్యాలెన్స్ స్థాయిలని బ్యాలెన్స్ చేస్తుంది.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 29 , 2024 | 04:04 PM