Share News

Uric Acid Levels : ఈ కూరలతో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరుగుతాయి.. అవేమిటంటే..!

ABN , Publish Date - Jul 17 , 2024 | 12:20 PM

విటమిన్ సి గౌట్ సమస్యను అధిగమించేలా చేస్తుంది. విటమిన్ సి, అధికంగా ఉండే పదార్థాలలో సిట్రస్, మిరియాలు, స్ట్రాబెర్రీలు, బ్రోకలీ వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Uric Acid Levels : ఈ కూరలతో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరుగుతాయి.. అవేమిటంటే..!
Uric Acid Levels

యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో మూడింట రెండు వంతుల యూరిక్ సహజంగా ఉత్పత్తి చేయబడుతుంది. అదే శరీరంలో మరీ ఎక్కువగా యూరిక్ యాసిడ్ ఉండటం వల్ల ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కి దారితీస్తుంది. ఆహారవనరుల ద్వారా శరీరం ప్యూరిన్స్ అనే సమ్మేళనాలను విచ్ఛిన్నం చేసినపుడు యారిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. మూత్ర పిండాలు దీనిని తొలగించలేకపోతే కీళ్ళలో పేరుకుపోతుంది. ఇది తీవ్రమైన నొప్పి, వాపుకు కారణం అవుతుంది.

ఈ కీళ్ళ దగ్గర వాపు వచ్చే వ్యాధిని గౌట్ అంటారు. దీనిని తగ్గించాలంటే సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నప్పుడు గౌట్ సమస్య పెరుగుతుంది. శరీరంలో హైపర్యూరిసెమియా, ప్యూరిన్ లను యూరిక్ యాసిడ్ గా మార్చే జీవక్రియ ప్రక్రియ.

Dengue fever : డెంగ్యూ జ్వరం కారణంగా మెదడు మీద కూడా ప్రభావం ఉంటుందా..!


ప్యూరిన్ ఎందుకు తక్కువ తినాలి.

1. ఆహారంలో ప్యూరిక్ అధికంగా ఉండే ఆహారాన్ని పరిమితంగా చేయడం గౌట్ సమస్యను తగ్గిస్తుంది. దీనికోసం ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోరాదు

2. ఎరుపు మాంసం ముఖ్యంగా జంతువులది తీసుకోరాదు.

3. రొయ్యల వంటి అధిక ప్యూరిన్ సీఫుడ్స్ తినకూడదు.

4. మొక్కల ఆధారిత పదార్ధాలను తీసుకోవడం మంచిది. పండ్లు, కూరగాయలు, ధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం ఉత్తమం.

Cardamom Tea : నోటి దుర్వాసనకు చెక్ పెట్టే యాలకులు.. ఈ టీ తాగితే..!


తినాల్సినవి

  1. ధాన్యాలు

  2. పండ్లు, కూరగాయలు

  3. తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు

  4. గుడ్లు

  5. టోఫు

తినకూడనివి.

  1. మద్యం

  2. ఎరుపు మాంసం

  3. అవయవ మాంసం

  4. గ్రేవీ

  5. సీఫుడ్స్

విటమిన్ సి తీసుకోవాలి.

విటమిన్ సి గౌట్ సమస్యను అధిగమించేలా చేస్తుంది. విటమిన్ సి, అధికంగా ఉండే పదార్థాలలో సిట్రస్, మిరియాలు, స్ట్రాబెర్రీలు, బ్రోకలీ వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఆహారంలో ఫ్యూరిన్లు, ప్రక్టోజ్, ఆల్కహాలు అధికంగా ఉన్న ఆహారాలు గౌట్ సమస్యను తగ్గిస్తాయి.

బరువు పెరగడాన్ని కూడా తగ్గిస్తుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 17 , 2024 | 12:38 PM