Share News

Grey Hair : చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోతే ఇంట్లో ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

ABN , Publish Date - Apr 22 , 2024 | 04:16 PM

మానసిక ఒత్తిడి వల్ల జుట్టు నెరిసిపోవచ్చు, అలాగే పోషకాహార లోపం వల్ల కూడా నెరిసిపోతుంది. వంశపారంపర్యం, ధూమపానం, పొగాకు నమలడం, మానసిక ఒత్తిడి వల్ల జుట్టు నెరిసిపోవచ్చు.

Grey Hair : చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోతే ఇంట్లో ఈ చిట్కాలు పాటిస్తే సరి..!
Grey Hair

అందమైన అమ్మాయికి ముఖ అందమే కాదు.. జడ తీసుకువచ్చే అందంకూడా ముఖ్యమే.. అది నల్లని కురులు తెచ్చే అందం ఎంతని చెప్పాలి. అలాంటిది.. వయసు చిన్నగానే ఉండి, వెంట్రుకలు తెల్లబడటం అంటే అది వయసుతో నిమిత్తం లేకుండా ముసలి ఛాయను తెస్తుంది. వయసు పెరిగే కొద్దీ చర్మం పటుత్వం కోల్పోయి, కుంగిపోయి కనిపిస్తుంది. ఇదే విధంగా వెంట్రుకలు తెల్లబడి రంగు మారతాయి. 40ల వయసులో సహజంగా వెంట్రుకలు రంగు మారి కనిపిస్తాయి. అదే 20 నుంచి 30 ల మధ్య వెంట్రుకలు బూడిద రంగుకు మారుతుంటే కనక ఇది ఇబ్బంది కలిగిస్తుంది. ఈ సమస్యను హోం రెమెడీస్ ద్వారా తగ్గించవచ్చు. ఇలాంటి సమస్యకు ఇంటి నివారణల ద్వారా చెక్ పెట్టవచ్చు. అదెలాగంటే..

గ్రే హెయిర్‌కు కారణాలు..!

మానసిక ఒత్తిడి వల్ల జుట్టు నెరిసిపోవచ్చు, అలాగే పోషకాహార లోపం వల్ల కూడా నెరిసిపోతుంది. వంశపారంపర్యం, ధూమపానం, పొగాకు నమలడం, మానసిక ఒత్తిడి వల్ల జుట్టు నెరిసిపోవచ్చు.

1. జన్యులోపం

2. థైరాయిడ్ రుగ్మత, ప్రొజెరియా వంటి అకాల వృద్ధాప్య సమస్యలు

3. ఐరెన్ లోపం

4. రక్తహీనత

5. మెలనోసైట్ల ఉత్పత్తి తగ్గడం

6. ఒత్తిడి

7. సోప్స్, సింథటిక్ ఫాంపూల అధిక వాడకం

8. జుట్టు కుదళ్లను దెబ్బతీసే UV కిరణాలకు గురికావడం ఇవి ప్రధానంగా చెప్పవచ్చు.

గ్రే హెయిర్‌కు హోం రెమెడిస్.. !

టాక్సిక్ కెమికల్స్ ఉన్న హెయిర్ ప్రోడక్ట్స్ ఉపయోగించడం వల్ల జుట్టు మరింత నెరిసిపోతుంది. దీనికి సహజమైన పదార్థాలతో చెక్ పెట్టవచ్చు.

1. కరివేపాకు, కొబ్బరి నూనె

కరివేపాకు జుట్టు మూలాలను పెంచడంలో సహకరిస్తుంది. కరివేరాకులో ఉండే విటమిన్ బి, జుట్టు కుదుళ్లకు జీవ సంబంధమైన రంగును ఇస్తుంది. అలాగే కొబ్బరి నూనె నెరిసిన జుట్టుకు మంచి పోషణను ఇస్తుంది.

Health Tips : రంగు మారిన గోళ్లు మన అనారోగ్యాన్ని ఇట్టే చెబుతాయట.. ! అదెలాగంటే..


2. ఆల్మండ్, లెమన్ జ్యూస్..

నిమ్మకాయ, బాదం నూనె రెండూ గ్రే హెయిర్ సమస్యకు చెక్ పెడతాయి. ఇది జుట్టు మూలాలకు పట్టించడం వల్ల మంచి ఫలితాలుంటాయి. బాదం నూనెలో విటమిన్ ఇ, ఉంటుంది. ఇది బూడిద రంగు జుట్టును నివారిస్తుంది.నిమ్మ రసం కూడా కుదుళ్ళకు బలాన్నిస్తుంది.

3. ఉసిరి, మెంతి గింజలు..

ఈ హెయిమాస్క్ లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది బూడిద రంగు జుట్టును తగ్గించి మంచి నలుపును ఇస్తుంది. అంతే కాదు జుట్టు బలంగా ఉండేలా చేస్తాయి.

4. ఉల్లిపాయరసం మాస్క్...

ఉల్లిపాయలు బూడిద జుట్టుకు ఉత్తమ నివారణ అవుతుంది. ఉల్లిరసం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. నిమ్మరసంలో కలిపి రాయడం వల్ల జుట్టుకు మెరుపు తగ్గుతుంది.


Sleep Changes: మహిళల్లో నిద్ర లేమి సమస్యలు ఎందుకు వస్తాయంటే..!

హెన్నా, కాఫీ..

హెన్నా, కాఫీ మాస్క్ జుట్టుకు వేయడం వల్ల మెరుపు తగ్గుతుంది.

బృంగరాజ్ హెయిర్ మాస్క్..

బృంగరాజ్ దీనిని కింగ్ ఆఫ్ ది హెయిర్ అంటారు. సహజ నివారణగా బ్రాహ్మి, బృంగరాజ్ ఒత్తిడిని తగ్గిస్తుంది. స్కాల్ఫ్ కు రిలీఫ్ ని ఇస్తుంది. జుట్టు నెరిసిపోకుండా చేస్తుంది.

Read Latest Navya News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 22 , 2024 | 04:21 PM