Share News

Sleep Changes: మహిళల్లో నిద్ర లేమి సమస్యలు ఎందుకు వస్తాయంటే..!

ABN , Publish Date - Apr 22 , 2024 | 01:10 PM

ఆకలిని నియంత్రించే హార్లోన్లకు నిద్ర కూడా తోడవుతుంది. తక్కువ నిద్ర మెనోపాజ్ సమయంలో, తర్వాత కూడా బరువు పెరగడానికి కారణం కావచ్చు. రోజులో ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర ప్రతి ఒక్కరికీ అవసరం.

Sleep Changes: మహిళల్లో నిద్ర లేమి సమస్యలు ఎందుకు వస్తాయంటే..!
Sleep

స్త్రీ జీవితకాలంలో వచ్చే మార్పులతో నిద్రపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధానంగా జీవనశైలిలో వస్తున్న మార్పులు కూడా కారణం అవుతాయి. పిరియడ్స్ సమయంలో హార్లోన్ల మార్పులు, బుుతుస్రావం, గర్భం కూడా నిద్రను ప్రభావితం చేస్తాయి. ఇవన్నీ నిద్ర రుగ్మతలను పెంచుతాయి. మొబైల్ ఫోన్స్, టీవీలు చూస్తూ కూర్చోవడం, నిద్రను దూరం చేస్తాయి. బిజీ లైఫ్, ఒత్తిడి వల్ల కూడా కంటి నిండా నిద్రపోలేకపోవడం జరుగుతుంది. ఇవే కాకుండా పని ఒత్తిడి, అధిక బరువు ఇబ్బందులు కూడా నిద్ర విషయంలో ఇబ్బంది కలిగేలా చేస్తాయి. ఇవే కాకుండా..

నిద్రపై ప్రభావం పురుషులు, స్త్రీలలో వేరు వేరుగా ఉంటాయి. మహిళల్లో పురుషులతో పోల్చితే మారుతున్న జీవన విధానం కారణంగా నిద్ర విధానలలో ఎక్కువ మార్పులు కలిగి ఉంటారు. నిద్రలేమి, మూడ్ డిస్టర్బెన్స్ అధిక రెట్లు కలిగి ఉంటారు. చాలా మంది స్త్రీలలో పిరియడ్స్ రావడానికి ముందు పిరయడ్స్ సమయంలో కూడా నిద్ర సమస్యలు ఉంటాయి. పిరియడ్స్ కు కారణమయ్యే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ PCOS, నిద్ర సమయంలో శ్వాసక్రియలో ఇబ్బంది కలగవచ్చు.

Drinking water : రోజులో ఎవరు ఎంత నీటిని తీసుకోవాలి?

గర్భం..

గర్భధారణ సమయంలో తరుచుగా నిద్రలేమి సమస్యలు ఉంటాయి. బిడ్డ గర్భంలో పెరుగుతున్న కొద్దీ బరువు కూడా వీపు పై ఒత్తడిని కలిగిస్తుంది. తరచుగా మెలుకువ రావడం, రాత్రి సమయంలో మానసిక స్థితిలో మార్పులు, ప్రసవానంతరం నిద్ర సమస్యలు ఉంటాయి. ఇది నిద్ర లేమికి, నిద్ర రుగ్మతలకు కారణం కావచ్చు.


మెనోపాజ్ సమస్యలు..

స్త్రీలలో మెనోపాజ్ నిద్రను మరింత తగ్గిస్తుంది. ఈస్ట్రోజెన్ తగ్గుదల ప్రధాన కారణం. మెనోపాజ్ తర్వాత స్ట్రీలు స్లీప్ అప్నియాను కలిగి ఉంటారు. హార్మోన్లను కోల్పోతారు.

Summer heat : సమ్మర్ హీట్‌కి చెక్ పెట్టే సమ్మర్ డ్రింక్స్ తీసుకుంటే..!

ఆకలిని నియంత్రించే హార్లోన్లకు నిద్ర కూడా తోడవుతుంది. తక్కువ నిద్ర మెనోపాజ్ సమయంలో, తర్వాత కూడా బరువు పెరగడానికి కారణం కావచ్చు. రోజులో ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర ప్రతి ఒక్కరికీ అవసరం.

నిద్ర సరిగా ఉండకపోవడం వల్ల శరీరం అలసిపోయిన ఫీలింగ్ లో ఉంటుంది. అలాగే ఈ ప్రభావం హార్మోన్ల మీద పడుతుంది. హార్మోన్ల అసమతుల్యత కారణంగా మహిళల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ మందగించవచ్చు. దీనికి నిద్రకూ సంబంధం ఉంటుంది. మెలటోనిన్ అనే హార్మోన్ సుఖవంతమైన నిద్ర ద్వారా విడుదలవుతుంది. నిద్ర లేమి కారణంగా ఇది శరీరానికి అందదు. దీనివల్ల అండం నాణ్యత క్షీణిస్తుంది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 22 , 2024 | 01:12 PM