Back Pain : నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే తక్షణమే ప్రభావం చూపే మార్గాలివే..
ABN , Publish Date - Jun 21 , 2024 | 01:52 PM
పడుకునే సమయంలో నడుము మీద ఒత్తిడి పడుతుంది. నడుము నొప్పి ఎక్కువగా ఉన్నవారు మోకాళ్ళ కింద దిండు పెట్టుకుని నిద్రపోవడం మంచిది. కాళ్ళు ఎత్తులో పెట్టడం వల్ల నడుము మీద ఒత్తిడి తగ్గుతుంది.
అనుకోకుండా నడుము నొప్పి మొదలైనప్పుడు అస్సలు ప్రశాంతంగా అనిపించదు. పడుకోవాలన్నా, కూర్చోవాలన్నా చాలా కష్టంగా మారిపోతుంది. పడుకున్నప్పుడు పరుపు కూడా ఎంత మెత్తగా ఉన్నా కూడా వీలుగా ఉండుదు. ఏ పనీ చేయలేని పరిస్థితి. నిద్రపోవడం, తిరగడం, పనిచేసుకోవడం వంటివి చాలా కష్టంగా మారిపోతాయి. ఎటూ కదిలేందుకు వీలుగా ఉండదు. ఇలాంటి పరిస్థితిల్లో ఫిజియోథెరపీ సలహాలను, సూచనలను పాటిస్తూ ఉంటాం. అయితే ఈ నడుం నొప్పిని చిన్న చిట్కాల ద్వారా పోగొట్టుకోవచ్చు. దీనికి ప్రధాన పరిష్కారంగా వ్యాయామం సరిపోతుంది.
నడుము నొప్పి ఉన్న వ్యక్తులకు నడక వంటి ప్రాథమిక వ్యాయామాలు ఉపశమనం కలిగిస్తాయి. ఆరునెలల పాటు ఫిజియోథెరపీ సెషన్ కు వెళుతున్నవారు చిన్న వ్యాయామాలతో ఈ నొప్పి నుంచి బయటపడవచ్చు. నడకతో చాలావరకూ నడుము నొప్పి తగ్గుతుంది.
Heart Health : ప్రతిరోజూ ఎండుద్రాక్ష నీరు త్రాగడం వల్ల కలిగే ఐదు ప్రయోజనాలివే..!
పడుకునే సమయంలో నడుము మీద ఒత్తిడి పడుతుంది. నడుము నొప్పి ఎక్కువగా ఉన్నవారు మోకాళ్ళ కింద దిండు పెట్టుకుని నిద్రపోవడం మంచిది. కాళ్ళు ఎత్తులో పెట్టడం వల్ల నడుము మీద ఒత్తిడి తగ్గుతుంది.
నడుముకు సంబంధించి వ్యాయామం చేయాల్సి వస్తే నడక, అలగే కండరాలను సాగదీసే స్ట్రెచ్ ఎక్సర్సైజ్లు చేయడం మంచిది.
కాల్షియం, విటమిన్ డి తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. కాల్షియం, విటమిన్ డి తప్పకతీసుకోవాలి. పాలు, పెరుగు, ఆకు కూరలు, విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవాలి.
Health Tips : నాలుక రంగుమారితే అది దేనికి సంకేతం.. శరీరంలోని రుగ్మతల గురించి నాలుక చెప్పేస్తుందా..!
నడుము నొప్పికి చెప్పులు.. నడుము నొప్పి తగ్గాలంటే ఎత్తు మడమల చెప్పులు తగ్గించాలి. ఇవి నడుము మీద ఒత్తిడిని తగ్గిస్తాయి.
కూర్చునే,నిల్చునే భంగిమలు.. ఆఫీసులో కూర్చున్నప్పుడు, నిలబడి ఉండడాన్ని బట్టి నడుం నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
Lose weight : ఈ పొడులతో బరువు తగ్గచ్చా.. ఎంత వరకూ పని చేస్తాయి..!
బరువు పెరగడం, బరువుగా ఉండటం కూడానడుము నొప్పికి మరోకారణం. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.
ఇతర వ్యాయామాల కంటే నడక చాలా గొప్పగా పనిచేస్తుంది. నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి వాకింగ్ మంచి ఎంపిక. వెన్నుముకను సున్నితమైన కదలికలు చాలా వరకూ సపోర్ట్ చేస్తాయి. ఆరోగ్యకరమైన బరువు, మెరుగైన మానసిక ఆరోగ్యంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.