Lean Protein : లీన్ ప్రోటీన్లు అంటే ఏమిటి? రక్తపోటు ఉన్న రోగులకు ఇది ఎలా సహకరిస్తుంది..!
ABN , Publish Date - Jul 23 , 2024 | 03:15 PM
ప్రోటీన్లు శరీరంలో బిల్డింగ్ బ్లాక్స్ లాంటవి. అవి ఎముకలు, మృదులాస్థి, కండరాలు, రక్తం, చర్మం, ఎంజైములు, హార్మోన్లు, విటమిన్స్ తయారీలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
అధిక రక్తపోటు ఉన్నవారు కిడ్నీ సమస్యతో కనుక బాధపడుతుంటే ఆహారంలో లీన్ ప్రోటీన్లు కీలకంగా పనిచేస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్, రక్తపోటును పెంచకుండా కండర ద్రవ్యరాశిని నిర్వహించడం ద్వారా మూత్రపిండాలపై భారాన్ని తగ్గిస్తాయి. శరీరంలో అధిక రక్తపోటు సమస్య ఉన్నట్లయితే ఆహారంలో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ చేర్చడం వల్ల మొత్తం ఆరోగ్యం సరి అవుతుంది. శరీరానికి ఎంత ప్రోటీన్ అవసరం, ముఖ్యమైన మాక్రోన్యూట్రియెంట్ వనరులు ఎందుకు అవసరం అనేది తెలుసుకుందాం.
ప్రోటీన్ ఎందుకు అవసరం..
ప్రోటీన్లు శరీరంలో బిల్డింగ్ బ్లాక్స్ లాంటవి. అవి ఎముకలు, మృదులాస్థి, కండరాలు, రక్తం, చర్మం, ఎంజైములు, హార్మోన్లు, విటమిన్స్ తయారీలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా శరీరం పెరుగుదల, మురమ్మత్తులు, కండరాలు, కణజాలాలను నిర్మించడానికి, రక్తం గడ్డకట్టడానికి, ద్రవ సమతుల్యత, రోగనిరోధక శక్తిని పెంచేందుకు అవసరం.
ప్రోటీన్లు అమైనో ఆమ్లాల నుండి తయారవుతాయి. శరీరంలో స్వయంగా తయారు చేసుకోగలిగే కొన్ని ఆమైనో ఆమ్లాలు ఉన్నాయి. వీటిని ఆహారంలో తీసుకుంటాం. ఇవి శరీరం పనితీరుకు అవసరం.
ఆహారాలలో ప్రోటీన్లు ఎక్కువ..
మొక్క, జంతు మూలాలు, ప్రోటీన్ పొందవచ్చు. ఆహారంలో ప్రోటీన్ మాసం, పాల ఉత్పత్తులు, గింజలు, కూరగాయలు, ధాన్యాలు, బీన్స్ నుంచి తీసుకోవచ్చు.
ప్రోటీన్ అధిక మొత్తంలో సంతృప్త కొవ్వులను తీసుకోవడం వల్ల తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ అని పిలుస్తారు. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడానికి ముడి పడి ఉంటుంది.
అధిక LDL స్థాయిలు ఉన్నట్లయితే రక్తనాళాలలో కొవ్వు నిల్వలు ఏర్పడతాయి.
Sleep Duration : నిద్ర మరీ ఎక్కువైనా ఇబ్బందేనా.. షుగర్ పెరుగుతుందా ..!
నెమ్మదిగా ఈ కొవ్వు నిల్వలు పెరిగి రక్తనాళాల్లో అడ్డంకిగా మారతాయి.
గుండె జబ్బులు, రక్తం గడ్డకట్టడం వంటి గుండె సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. గుండె పోటు ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుంది.
లీన్ ప్రోటీన్ అనేది సంతృప్త కొవ్వులు, కేలరీలలో తక్కువగా ఉండే ప్రోటీన్..
Human brain : మానవ మెదడు గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా..!
అసంతృప్త కొవ్వును తినడం మంచి గుండె ఆరోగ్యానికి అవసరం.
లీన్ ప్రోటీన్ మూలాలు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచకుండా ప్రోటీన్ తీసుకోవడం అవసరాలను తీర్చడంలో సహకరిస్తుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.