Share News

Women Health : మహిళలు ఎందుకు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి..!

ABN , Publish Date - Jul 22 , 2024 | 04:44 PM

ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్ తయారు చేయడానికి శరీరానికి ఇనుము అవసరం. ఇది శరీర కణజాలాలను ఆక్సిజన్‌ను తీసుకువెళ్ళేలా చేస్తుంది.

Women Health : మహిళలు ఎందుకు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి..!
Health Benefits

స్త్రీలు బలహీనంగా మారడానికి అనేక కారణాలున్నాయి. ఆరోగ్య సమస్యలతోపాటు సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, సరైన విశ్రాంతి వేళలు పాటించకపోవడం వంటివి ఆడవారు ఓ వయసుకు రాగానే బలహీనం కావడానికి కారణాలుగా మారుతున్నాయి. తమ పని తప్పితే ఆరోగ్యం మీద శ్రద్ధపెట్టని ఆడవారు 30 దాటాకా ఇక ఒక్కసారిగా అనారోగ్య సమస్యలు మీద పడటం తోనే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చాలా వరకూ సరైన పోషకాలున్న ఆహారాన్ని సమయం పాటించి తీసుకోకపోవడమే. కానీ ఇది తినాలని, ఇది తినకూడదని ఎవరు చెప్పినా చెప్పకపోయినా నేటి రోజుల్లో కాస్త అవగాహనతో మెలగడం ప్రతి ఒక్కరికీ అవసరం.

వయస్సు, లింగం, తీసుకువే ఆహారం వీటి ఆధారంగా శరీరంలో ఐరన్ అవసరం అవుతుంది. స్త్రీలకు పుట్టినప్పటి, రజస్వల అయిన సమయంలో, గర్భవతిగా ఉన్నప్పుడు, తల్లిపాలు ఇస్తున్నప్పుడు స్త్రీలకు ఎక్కువ ఐరన్ అవసరం అవుతుంది. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా లోపం అంటే రక్త హీనత, రక్తంలో తగినంత ఆరోగ్యకరమైన ఎర్ర రక్క కణాలు లేకపోవడం ఈ పరిస్థితికి దారితీస్తుంది.


Good Heabits : ఒత్తిడి లేని జీవనానికి 7 అలవాట్లు ఇవే.. !

ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్ తయారు చేయడానికి శరీరానికి ఇనుము అవసరం. ఇది శరీర కణజాలాలను ఆక్సిజన్ ను తీసుకువెళ్ళేలా చేస్తుంది. ఇదే సమయంలో తగినంత రక్త కణాలు పనిచేయాలంటే శరీరంలో ఇనుము తప్పక ఉండాల్సిందే. ఇది తేడా వస్తే శరీరం బలహీనంగా అనిపిస్తుంది. ఇనుముతో కూడిన ఆహారం తినేటప్పుడు, చిన్నప్రేగు ద్వారా తీసుకోబడుతుంది.

ఆహారం నుండి రెండురకాల ఇనుము తీసుకోబడుతుంది. అందులో హిమ్ , నాన్ హీమ్, హీమ్ ఐరన్ హిమోగ్లోబిన్ నుండి వస్తుంది. ఇది ఎర్రని మాంసం, చేపలు, పౌల్ట్రీ ఆహారాల ద్వారా హిమోగ్లోబిన్ గ్రహించబడుతుంది. నాన్ హిమ్ ఇనుము మొక్కల ద్వారా సులభంగా తీసుకోవచ్చు. బచ్చలికూర, బీన్స్, ధాన్యం, తృణధాన్యలు, వంటి బలవర్థకమైన ఆహారాల నుంచి వస్తుంది.

Drinking Vamu Water : వాము నీటిని ప్రతిరోజూ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయంటే...

శరీరంలోని 70% ఇనుము హిమోగ్లోబిన్ ఉత్పత్తి అవుతుంది. శరీరం ఇనుములో 25% ఫెర్రిటిన్ అనే రక్త ప్రోటీన్‌లో నిల్వ చేస్తుంది. ఇది సాధారణంగా కాలేయం, రోగనిరోధక వ్యవస్థకణాలలో నిల్వ చేయబడుతుంది.


ఎవరికి ఎంత ఐరన్ కావాలంటే..

పుట్టిన నాటి నుంచి 6 నెలల వరకు: 0.27 మిల్లీగ్రాములు

శిశువులు 7-12 నెలలు వరకూ : 11 మిల్లీగ్రాములు

పిల్లలు 1-3 సంవత్సరాల వరకూ : 7 మిల్లీగ్రాములు

పిల్లలు 4-8 : 10 మిల్లీగ్రాములు

పిల్లలు 9-13 : 8 మిల్లీగ్రాములు

టీనేజ్ అబ్బాయిలు 14-18: 11 మిల్లీగ్రాములు

-18 మంది అమ్మాయిలు 14 : 15 మిల్లీగ్రాములు

పురుషులు 19-50: 8 మిల్లీగ్రాములు

మహిళలు 19-50: 18 మిల్లీగ్రాములు

పెద్దలు 51 నుంచి : 8 మిల్లీగ్రాములు

గర్భిణీలు: 27 మిల్లీగ్రాములు

తల్లిపాలు ఇచ్చే సమయంలో : 10 మిల్లీగ్రాములు

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 22 , 2024 | 04:44 PM