Share News

Health Benefits : బ్రెజిల్ నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ABN , Publish Date - Jul 06 , 2024 | 12:07 PM

బ్రెజిల్ నట్స్ రోజుకి రెండు తింటే చాలు ఈ నట్స్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించడంతో పాటు ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగుపరుస్తాయి. ఈ నట్స్ పచ్చిగా తినకూడదు. ఉడికించి లేదా రాత్రంతా నానబెట్టి మాత్రమే తినాలి.

Health Benefits : బ్రెజిల్ నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
Health Benefits

నట్స్ ఆరోగ్యానికి ముఖ్యమైన ఆహారం. ఆరోగ్యకరమైన ఆహారంలోనే ప్రత్యేకంగా చెప్పుకునే నట్స్ విషయానికి వస్తే ఇందులో బాదం, పిస్తా, అక్రోడ్స్, అంజీర్, జీడిపప్పు ఇవన్నీ వెంటనే చెప్పేస్తాం. అయితే నట్స్ అంటే ఇవి మాత్రమే కాదు. మనకు తెలియని నట్స్ చాలా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న నట్స్ లలో బ్రెజిల్ నట్స్ కూడా ఒకటి. అచ్చం చూడడానికి పనసగింజల్లా అనిపించే ఈ గింజలతో బోలెడు ఆరోగ్యం. ఈ నట్స్ బ్రెజిల్ నుంచే దిగుమతి చేస్తున్నారు. ఇవి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుంచి సేకరిస్తారు. వీటితో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

బ్రెజిల్ నట్స్ యాంటీ ఆక్సిడెంట్లతో పాటు సెలీనియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇంకా ప్రోటీన్స్, ఫైబర్, సెలీనియం, కాపర్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, థయామిన్, విటమిన్ ఇ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ థైరాయిడ్ ఉన్నవారికి మేలు చేస్తాయి.

బ్రెజిల్ గింజలను సాధారణంగా పచ్చిగా లేదా బ్లాంచ్ చేసి తింటారు. వీటిలోని ప్రోటీన్, డైటరీ ఫైబర్, థయామిన్, సెలీనియం , కాపర్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి . వీటి నూనెను షాంపూలు, సబ్బులు , జుట్టు కండీషనర్లు, చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు.

Skin Brightens : పసుపు నీటితో ముఖాన్ని కడిగితే చాలు.. ముఖం మెరిసిపోవడం ఖాయం...!


ఇవి థైరాయిడ్ గ్రంధిని దెబ్బ తినకుండా కాపాడుతుంది. సెలీనియం లోపం వల్ల హైపోథైరాయిడిజం, థైరాయిడిటిస్, థైరాయిడ్ పెరుగుదల వంటి అనేక పరిస్థితులకు దారితీస్తుంది.

ఆరు బ్రెజిల్ నట్స్ లో సుమారు 185 కేలరీలుంటాయి. ఇంకా 4 గ్రాముల ప్రోటీన్, 3 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 19 గ్రాముల కొవ్వు ఉంటాయి.

Monsoons Tips : వర్షాకాలంలో ఈ ఔషధాలను తీసుకోవాల్సిందే.. వీటితో..!

బ్రెజిల్ నట్స్ తింటే చాలు.. బాదం పప్పు కంటే పెద్ద పరిమాణంలో ఉండే ఈ నట్స్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించడంతో పాటు ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగుపరుస్తుంది.

బ్రెజిల్ నట్స్ రోజుకి రెండు తీసుకున్నా సరిపోతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించడంతో పాటు ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగుపరుస్తాయి. ఈ నట్స్ పచ్చిగా తినకూడదు. ఉడికించి లేదా రాత్రంతా నానబెట్టి మాత్రమే తినాలి.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 06 , 2024 | 12:12 PM