Share News

Boosts Immunity : ఉల్లిపాయను పచ్చిగానే తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?

ABN , Publish Date - Jun 26 , 2024 | 11:19 AM

పచ్చి ఉల్లిపాయను తీసుకోవడం వల్ల ఇందులోని డైటరీ ఫైబర్ శరీరం నుంచి వెలువడే వ్యర్థాలను జీర్ణక్రియ ద్వారా తొలగిస్తుంది.

Boosts Immunity : ఉల్లిపాయను పచ్చిగానే తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?
Boosts Immunity

ఉల్లిపాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయనేది మనలో చాలామందికి తెలుసు. ఆహారంలో, ఔషధంగానూ ఉల్లిపాయను ఉపయోగిస్తాం కనకనే ఉల్లిచేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిపాయను కూరలలో వాడటం మామూలే. అయితే పచ్చిగా తీసుకోవడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయట. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందంటారు. పచ్చి ఉల్లిపాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తిని పెంచే ఉల్లి..

పచ్చి ఉల్లిపాయలు విటమిన్ సి ని కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తినిపెంచుతాయి. విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల బాక్టీరియా, వోరస్ ల నుంచి రక్షణ కల్పిస్తుంది. తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యానికి..

ఉల్లిపాయలలో క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. పచ్చి ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల రక్తపోటు మెరుగుపడి, గుండె జబ్బులను రాకుండా చేస్తుంది.


Weight Loss: ఒక్క జీర్ణక్రియకే కాదు, బరువు తగ్గడంలోనూ వాము బాగా పనిచేస్తుంది..!

జీర్ణక్రియలో సహకరిస్తుంది.

పచ్చి ఉల్లిపాయను తీసుకోవడం వల్ల ఇందులోని డైటరీ ఫైబర్ శరీరం నుంచి వెలువడే వ్యర్థాలను జీర్ణక్రియ ద్వారా తొలగిస్తుంది.

వాపును తగ్గిస్తుంది.

క్వెర్సెటిన్ అధికంగా ఉండే పచ్చి ఉల్లిపాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. ఇవి శరీరంలో ఏ భాగంలో కలిగే మంటనుంచి అయినా ఉపశమనాన్ని ఇస్తుంది.

ఎముక ఆరోగ్యానికి కూడా..

ఉల్లిపాయ ఎముక ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. ఈ సమ్మేళనాలు కాల్షియం, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని నివారించడంలో సహకరిస్తుంది.

Brain Health : విటమిన్ బి12 పుష్కలంగా ఉన్న ఫుడ్స్ ఇవే..


మెదడు పనితీరును పెంచుతుంది.

పచ్చి ఉల్లిపాయలో సల్ఫర్ అధికంగా ఉంటుది. ఇది మెదడులో న్లూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని పెంచుతాయి.క్యాన్సర్ నివారించడంలో ముందుంటుంది.

చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది.

ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి కలిగి ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 26 , 2024 | 11:19 AM