zinc deficiency : జింక్ లోపంతో శరీరంలో కనిపించే లక్షణాలు, సంకేతాలు ఎలా ఉంటాయంటే..!
ABN , Publish Date - Jun 17 , 2024 | 03:10 PM
జింక్ లోపం ఉంటే జుట్టు, చర్మ ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది. అంతే కాదు రుచి, వాసన విషయంలో కూడా గణనీయంగా మార్పులు కనిపిస్తాయి. గాయం తగ్గకపోవడం, మూడ్ స్వింగ్స్ , మెమరీ సమస్యలు కూడా ఉంటాయి.
శరీరానికి తక్కువ మొత్తంలోనే జింక్ అవసరం ఉంటుంది. కానీ ఇది లోపిస్తే మాత్రం ముఖ్యమైన శరీర విధులు ప్రభావితం అవుతాయి. ఆందోళనకరమైన లక్షణాలు దీనితో కనిపిస్తాయి. శరీరాన్ని మరింత బలోపేతం చేసి, బలమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. మాంసం, పౌల్ట్రీ, సీఫుడ్, చిక్కుళ్ళు, తృధాన్యాలు, జింక్ పుష్కలంగా ఉండే పదార్థాలు. ఈ జింక్ లోపంతో శరీరంలో అనేక మార్పులు, లక్షణాలు ఉంటాయి. అవేమిటంటే..
జింక్ లోపం ఉంటే జుట్టు, చర్మ ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది. అంతే కాదు రుచి, వాసన విషయంలో కూడా గణనీయంగా మార్పులు కనిపిస్తాయి. గాయం తగ్గకపోవడం, మూడ్ స్వింగ్స్ , మెమరీ సమస్యలు కూడా ఉంటాయి. బాల్యంలో కౌమార దశలో గర్భధారణ వంటి సమయాల్లో డింక్ అవసరం పెరుగుతుంది.
జింక్ లోపం కారణంగా వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. డింక్ సప్లిమెంట్లు వాడాలంటే మాత్రం డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకుంటూ ఉండాలి.
Proten Rich Foods : కండరాల పెరుగుదలకు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు ఎంత వరకూ సపోర్ట్ ఇస్తాయి..!
జింక్ లోపం సంకేతాలు..
జుట్టు రాలడం.. ఇది ప్రధాన సమస్యగా మారుతుంది. జింక్ లోపం కారణంగా జుట్టు పోషణలో పెరుగుదలలో మార్పులు ఉంటాయి. జుట్టు విపరీతంగా రాలుతుంది.
కంటి సమస్యలు.. కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే జింక్ కీలకం. దృష్టి లోపం కారణంగా రాత్రి పూట కనిపించకపోవడం, తక్కువ కంటి చూపు వంటి సమస్యలు ఉంటాయి.
Golconda Bonalu Festival : జూలై 7న వైభవంగా జరగనున్న గోల్కొండ బోనాలు జాతర..
రుచి వాసనలో తేడా.. జింక్ లోపం కూడా రుచి, వాసన కోల్పోవడానికి దారితీస్తుంది.జింక్ లేకపోతే రుచి, వాసన సామర్థ్యం తగ్గడానికి దారితీస్తుంది.
బలహీనమాన గాయం.. జింక్ లోపంతో శరీరానికి గాయం అయినా నయం కావడానికి సమయం పడుతుంది. ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది.
చర్మం సమస్యలు.. చర్మం సున్నితంగా, మృదువుగా ఉంటుంది. అయితే జింక్ లోపంతో చర్మం పొడిబారుతుంది. చర్మ రుగ్మతలు ఉంటాయి.
అంటువ్యాధుల సమస్య.. ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు జింక్ అవసరం. అదే జింక్ లోపిస్తే అంటువ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది.
పెరుగుదలలో లోపాలు, జీర్ణ సమస్యలు, హైపోగోనాడిజం, నరాల బలహీనత వంటి సమస్యలుంటాయి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.