Blood Sugar Control : ఈ ఫుడ్స్‌ను తిన్నారో షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయంతే..!
ABN , Publish Date - Jun 15 , 2024 | 04:25 PM
షుగర్ పెరిగే పదార్థాలలలో పండ్ల రసాలు, మిల్క్ షేక్స్ ముఖ్యంగా దూరంగా ఉండాల్సిన పదార్థాలు, ఇవి తీసుకోకుండా ఉండటం మంచిది. మామిడి, పనస వంటి పండ్లలో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది.
షుగర్ వ్యాధి ఉన్న వారికి చాలా పదార్థాలు తినేందుకు ఇబ్బంది ఉంటుంది. కాస్త తీపితిన్నా, రైస్ పదార్థాలను తీసుకున్నా, పండ్లు, స్వీట్స్ ఇలా ఏది తీసుకున్నా సరే వెంటనే తేడా వచ్చేస్తుంది. వెంటనే షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. దీనితో ఇబ్బందిగా మారుతుంది పరిస్థితి. అసలు ఏ ఆహారాలను తీసుకున్న వెంటనే షుగర్ పెరుగుతుంది. గమనించుకుని వాటికి దూరంగా ఉండటమే.
డయాబెటీస్ సమస్య ఉన్నవారు డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోజంతా తినే పదార్థాల మీద అవగాహన ఉండాలి. మనం తీసుకునే కొన్ని ఆహారాలతో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. మరి కొన్నింటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కొన్ని ఫుడ్స్ కొవ్వులు అధికంగా కలిగి ఉంటాయి. ఇలా అంచనా లేకుండా తీసుకుంటే మాత్రం షుగర్ అమాంతం పెరుగుతుంది.
షుగర్ పెరిగే పదార్థాలలలో పండ్ల రసాలు, మిల్క్ షేక్స్ ముఖ్యంగా దూరంగా ఉండాల్సిన పదార్థాలు, ఇవి తీసుకోకుండా ఉండటం మంచిది. మామిడి, పనస వంటి పండ్లలో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే ఉంటుంది. ఇవి తీసుకుంటే షుగర్ క్షణాల్లోనే పెరుగుతుంది.
Golconda Bonalu Festival : జూలై 7న వైభవంగా జరగనున్న గోల్కొండ బోనాలు జాతర..
అలాగే తేనె చక్కెర కాదు కాబట్టి దానిని తీసుకోవచ్చు అనుకుంటారు కానీ దానిలోనూ ఫ్రక్టోజ్ ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల కూడా షుగర్ అమాంతం పెరుగుతుంది. చెరకురసం ఇందులో ఫ్రక్టోజ్, సూక్రోజ్ అనేవి అధికంగా ఉంటాయి, ఇది తీసుకోకపోవడం మంచిది.
బంగాళా దుంపులు చిప్స్ రూపంలోనూ, కూరగా, ఫ్రై రూపంలో కూడా తింటూ ఉంటాం. నిజానికి వీటిని కూడా షుగర్ వ్యాధి ఉన్నవారు తీసుకోకూడదు. వీటికి దూరంగా ఉండటం మంచిది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.