Share News

Drink Milk Tea : రోజూ పాలతో చేసిన టీ తాగితే శరీరంలో ఎలాంటి మార్పులు ఉంటాయి..!

ABN , Publish Date - Jun 18 , 2024 | 02:12 PM

పాలు, టీ కలిపి తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు. పైగా తీపి కలిపిన ఈ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని పెంచుతుంది.

Drink Milk Tea : రోజూ పాలతో చేసిన టీ తాగితే శరీరంలో ఎలాంటి మార్పులు ఉంటాయి..!
Drink Milk Tea

టీ ప్రతి ఒక్కరికీ అలవాటైన పానీయం. ఇది ఉదయాన్నే గొంతులో పడకపోతే తెగ ఫీలైపోతూ ఉంటారు. ఇక కాస్త పెద్దవాళ్ళయితే రోజులో ఎన్నిసార్లో టీ చుక్క కోసం తహతహలాడిపోతారు. అయితే ఈ టీ అలవాటు ఎంత గొప్పగా చెప్పుకున్నా హాని చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు ఈ టీ అలవాటు ఎంతవరకూ బెటర్.. అది తెలుసుకుందాం.

పాలతో తయారు చేసిన టీ మంచి క్రీమీ రుచితో మళ్ళీ మళ్ళీ తాగాలనే ఆశ కలిగిస్తుంది. అసలు రోజులో టీ లేకుండా ఉండలేనివారు కూడా ఉన్నారు. అయితే టీ ని అదీ పాలతో చేసిన టీని తాగడం వల్ల శరీరంలో బోలు ఎముక వ్యాధి వచ్చే అవకాశం ఉండదట. అలాగే టీలోని కెఫీన్ అప్రమత్తంగా ఏకాగ్రతతో ఉండేలా సహకరిస్తుంది. టీలోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలు దెబ్బతినకుండా చేస్తుంది.

అయితే కొందరిలో మాత్రం పాలు, టీ కలిపి తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు. పైగా తీపి కలిపిన ఈ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని పెంచుతుంది. మితిమీరిన కెఫిన్ కారణంగా టాయిలెట్ సమస్య తలెత్తుతుంది.

Viral Video : ఫొటోగ్రాఫర్ కెమెరాకు చిక్కిన టైగర్ పంజా .. !


మిల్క్ టీలో ఉండే కెఫిన్ కంటెంట్ కారణంగా ..

1. మిల్క్ టీలోని పదార్థాలు జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి.

2. యాంటీ-ఆక్సిడెంట్లు అవి మీ కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి.

3. టానిన్లు టీ సమ్మేళనాలు చాలా వరకూ ఇనుమును గ్రహించే సామర్థ్యాన్ని గందరగోళానికి గురిచేస్తాయి.

4. రోజువారీ టీ బరువు పెరగడానికి జీవక్రియ సమస్యలకు కారణం అవుతుంది. టైప్ 2 డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మిల్క్ టీ నుండి బ్లడ్ షుగర్ లెవెల్స్ పై ప్రభావం చూపుతుంది.

5. మిల్క్ టీతో పాటు నీటినికూడా పుష్కలంగా తీసుకోవాలి. ఇది హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 18 , 2024 | 02:12 PM