Blood Sugar Levels : బెండకాయతో ఎన్ని బెనిఫిట్స్ అంటే.. దీనిని తింటే షుగర్ లెవల్స్ పెరగవంతే..!
ABN , Publish Date - Jun 17 , 2024 | 04:19 PM
బెండకాయ కాస్త పొడవుగా, సన్నగా ఉండే బెండకాయలో మంచి పోషకాలున్నాయి. బెండకాయ కూరంటే దాదాపు అందరికీ ఇష్టమే. దీనితో చాలా రకాలను చేయవచ్చు.
బెండకాయ కాస్త పొడవుగా, సన్నగా ఉండే బెండకాయలో మంచి పోషకాలున్నాయి. బెండకాయ కూరంటే దాదాపు అందరికీ ఇష్టమే. దీనితో చాలా రకాలను చేయవచ్చు. ఫ్రై చేసినా, పకోడీ వేసినా, కర్రీ చేసినా, పులుసు, పోపు ఏది చేసినా బెండకాయ రచి, పోషకాల విషయంలో అస్సలు చూసుకోనవసరం లేదు.
బెండకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
డయాబెటిస్ డైట్ లో అధిక ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో గొప్పగా పనిచేస్తుంది.
జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలన్నా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగకూడదన్నా బెండకాయ చాలా గొప్పగా పనిచేస్తుంది.
ఆహారంలో బెండకాయ చేర్చుకోవడం వల్ల తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. తక్కువ GL ఉన్న ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తులగా పంచడానికి దోహదం చేస్తాయి. అవి నియంత్రణలో ఉండాలంటే మధుమేహంతో బాధపడే వారు బెండకాయ క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిది.
zinc deficiency : జింక్ లోపంతో శరీరంలో కనిపించే లక్షణాలు, సంకేతాలు ఎలా ఉంటాయంటే..!
ఇన్సులిన్ సన్సివిటీ..
మధుమేహం వ్యాధిగ్రస్తులలో ఇన్సులిన్ సెన్సిటివ్ అనేది ఒక సాధారణ సమస్య. బెండకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
షుగర్ వ్యాధి ఉన్నవారు ఈ బెండకాయ తింటే షుగర్ కంట్రోల్లోకి తెస్తుంది. మామూలుగా బెండకాయలంటేనే చాలా మందికి ఇష్టమైన ఆహారం. ఇందులో కరగని, కరిగే ఫైబర్ ఉటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సరిపోతుంది. ఆహారంల ఫైబర్ ఎందుకు అవసరం అంటే ఇందులోని కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను ఆలస్యం చేయడంలో, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో ఆకస్మిక మార్పులు కనిపిస్తాయి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.