Digestive Health : పుచ్చకాయ రసంలో చియా విత్తనాలను కలిపినపుడు ఏం జరుగుతుంది..!!
ABN , Publish Date - Jun 15 , 2024 | 02:04 PM
పుచ్చకాయలో విటమిన్లు, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, మినర్స్ పుష్కలంగా ఉంటాయి. అవి చియావిత్తనాలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్, సూక్ష్మ పోషకాలతో నిండి ఉంటాయి.
వాతావరణంలో కాస్త వేడి పెరిగినా శరీరం తట్టుకోలేదు. వెంటనే చల్లని పదార్థాల కోసం వెతికేస్తూ ఉంటాం. దీనికోసం చల్లని పదార్థాలు, పానీయాలు ఎంచుకుంటాం. చల్లదనం శరీరానికి చాలా అవసరం కూడా ఇది శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడేందుకు సహకరిస్తుంది. జీర్ణక్రియకు, బరువు దగ్గడానికి కూడా మనం తీసుకునే ఆహారాలు సహకరిస్తాయి. ఇందులో ముఖ్యంగా పుచ్చకాయ నీటి శాతం అధికంగా కలిగిన పండు. దీనిని తీసుకోవడం వల్ల హైడ్రేషన్ గా ఉండవచ్చు. దీనితో అనేక పోషకాలు కూడా అందుతాయి. ఇక చియా సీడ్స్ ఇవి గండె ఆరోగ్యాన్ని, చర్మం నిగారింపును పెంచుతాయి. ఈ రెంటినీ కలిపి తీసుకోవచ్చా.. అదే చూద్దాం.
పుచ్చకాయ, చియాసీడ్స్..
పండ్లలో నీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయ వేసవి ఫ్రూట్. పుచ్చకాయ నీరు, చియా సీడ్స్ కలిపి తీసకోవడం వల్ల ఇది హైడ్రేషన్ పానీయంగా మారుతుంది. అలాగే శరీరంలోని ద్రవాలను తిరిగి నింపడంలో కూడా సహకరిస్తుంది. ఇది మొత్తం హైడ్రేషన్‌లో సహాయపడుతుంది.
న్యూట్రియంట్..
పుచ్చకాయలో విటమిన్లు, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, మినర్స్ పుష్కలంగా ఉంటాయి. అవి చియావిత్తనాలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్, సూక్ష్మ పోషకాలతో నిండి ఉంటాయి. ఈ పానీయాన్ని రోజూ తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది.
Super Foods Found : విదేశీ పోషకాహారాలు ఎందుకు? మన దేశంలో దొరికే సూపర్ ఫుడ్స్ చాలు.. ఆరోగ్యాన్ని పెంచేందుకు..
చియా గింజలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ప్రేగు కదలికలకు, మలబద్దకాన్ని తగ్గించడానికి సహకరిస్తుంది. జీర్ణ క్రియకు సపోర్ట్ చేస్తుంది. బరువు కూడా ఇట్టే తగ్గచ్చు.
పుచ్చకాయలోని విటమిన్ సి, లైకోపీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తటస్తం చేయడంలో సహాయపడతాయి. వెంటనే శక్తిని ఇస్తుంది. ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే చియా విత్తనాలతో కలిపినప్పుడు పుచ్చకాయ జ్యూస్ మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.