Golconda Bonalu Festival : జూలై 7న వైభవంగా జరగనున్న గోల్కొండ బోనాలు జాతర..
ABN , Publish Date - Jun 15 , 2024 | 12:12 PM
ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులతో గోల్కొండ పరిసరాలన్నీ కిటకిటలాడుతూ, సందడిగా మారిపోతాయి. ఈ ఏడాది జూలై ఏడో తారీఖున ఆదివారం నాడు గోల్కొండ బోనాల ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి.
హైదరాబాద్ పరిసరాల్లో సందడంటే జాతరలు, బోనాలదే ప్రత్యేకమైన సందడి. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులతో గోల్కొండ పరిసరాలన్నీ కిటకిటలాడుతూ, సందడిగా మారిపోతాయి. ఈ ఏడాది జూలై ఏడో తారీఖున ఆదివారం నాడు గోల్కొండ బోనాల ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. తెలుగువారు గర్వించదగిన సంబరం ఇది. ఆషాడం అమావాస్య తరువాత ఆదివారం జరుపుకుంటారు. ఈ ఉత్సాహభరితమైన పండుగ గోల్కొండ కోటలోని జగదాంబిక ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఒక నెలపాటు జరగనున్నాయి.
గోల్కొండ ఎల్లమ్మ జాతర..
భక్తులు వందలాది మంది ఇక్కడకు తరలివస్తారు. గోల్కొండ ఆలయంలో తొమ్మిది రోజుల పాటు బోనాలు జరుగుతాయి. ఇది ఊరేగింపుతో ప్రారంభం అవుతుంది. బంజారా దర్వాజా నుండి బోనం ఊరేగింపు విగ్రహపీఠం ఆచారం. ఈ బోనాల జాతరకు రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నామని గోల్కొండ శ్రీజగదాంబిక మహంకాళి దేవాలయం వర్కర్స్ ప్రెసిడెంట్ సాయిబాబా తెలిపారు.
Health Tips : వెల్లుల్లి తీసుకుంటే శరీరానికి ఇన్ని లాభాలా..!
అమ్మవారికి ప్రతి ఆది, గురువారాల్లో మొత్తం తొమ్మిది రకాల పూజలను చేస్తారు. ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణ గుసాడి నృత్యం నుంచి పేరిణి నృత్యకారుల వరకూ జానపద కళాకారులు ప్రదర్శనలు సందడిని మరింత పెంచుతాయి. లంబాడీ నృత్యకారులు లయబద్దంగా ఆడే ఆటలు, డప్పుల మోతతో, యువకుల డాన్స్ చేయడం ఇదంతా అక్కడి వాతావరణాన్ని మరింత అందంగా మార్చేస్తుంది. డోలు శబ్దాలు అక్కడి భక్తుల్లో పూనకాలు వచ్చినట్టే అవుతుంది.
గోల్కొండ బోనాల తరువాత ఉజ్జయిని మహంకాళి బోనాలు, లాల్ దర్వాజ మహంకాళి పండుగ కొనసాగుతుంది. ఈ వేడుకులకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు హాజరవుతారు. ప్రస్తుత కమిటీ పదవీ కాలం ముగియడంతో గోల్కొండ బోనాల కోసం కొత్త ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసే పనిలో ఎండోమెంట్ శాఖ వారు కృషి చేస్తున్నారు.
జూలై 7, 11, 14, 18, 21,25, 28 ఆగష్టు 1, 8, 9 తోదీల్లో పూజతో బోనాల జాతర ముగుస్తుంది.