Nutritional Benefits : అవకాడో, గుడ్డు రెండిటిలో ఏ టోస్ట్ అల్పాహారంగా బెస్ట్ అంటారు..!
ABN , Publish Date - Jun 18 , 2024 | 03:32 PM
గుడ్డు టోస్ట్, అవకాడో టోస్ట్ మధ్య పోషకా అవసరాలు, రుచికి ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. మెదడు ఆరోగ్యానికి అధిక ప్రోటీన్ ఎంపిక చూస్తున్నట్లయితే, గుడ్డుటోస్ట్ మంచి ఎంపిక. ఇందులో గుండె ఆరోగ్యానికి స్థిరమైన రక్తంలో చక్కెర స్థాయిలను ప్రోత్సహించే ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్తో మంచి రుచికరమైన అల్పాహారం తయారవుతుంది.
అవకాడో, గుడ్డు ఎండూ భిన్నమైన పదార్థాలు అయితే అవకాడో పండు చాలా పోషకాలు కలిగినది. అలాగే గుడ్డు కూడా మంచి పోషకాలకు పెట్టింది పేరు. దీనిని రోజూ తీసుకున్నవారు ఆరోగ్యంతో ఉంటారనేది అందరికీ తెలిసిన మాటే. వీటితో శక్తి పెరుగుతుంది. దీనిని అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు. అయితే రెండింటిలో దేనిని ఎంచుకుంటే మంచిది అదే తెలుసుకుందాం.
అవకాడోలో 240 కేలరీలు, గుడ్డులో 70 కేలరీలున్నాయి.
అవకాడోలో ప్రోటీన్స్ 3 గ్రాములు, గుడ్డులో 6 గ్రాములు
అవకాడోలో కొవ్వు 22 గ్రాములు
అవకాడో, గుడ్డులో కార్బోహైడ్రేట్లు 6 గ్రాము వరకూ ఉన్నాయి.
కాబట్టి తెలివిగా ఎంచుకోవడమే. ఏది మన ఆరోగ్యానికి మంచిది అనే విషయంలో గుడ్డు టోస్ట్ లో అవకాడో, వెన్న కలిపి తయారు చేసుకునే అల్పాహారం మంచి రుచిగా ప్రత్యేకమైన శక్తిని అందించే పదార్థంగా మారుతుంది.
ఎగ్ టోస్ట్..
గుడ్లలో కోలిన్ ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని పనితీరును పెంచుతుంది. ఎగ్ టోస్ట్ తినడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. దీనితో పాటు జున్ను, కూరగాయలను ఎంచుకున్నా బావుంటుంది.
అవకాడో టోస్ట్..
అవకాడో టోస్ట్ ఇటీవలి కాలంలో బాగా ప్రాచుత్యం పొందింది. ముఖ్యంగా ఆరోగ్యం మీద అవగాహన, శ్రద్ధా ఉన్నవారంతా కూడా తమ ఆహారంలో అవకాడోను ఏదో రూపంలో తీసుకుంటూ ఉన్నారు. ఇందులో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. ఇందులో కె, ఇ, సి వంటి అనేక రకాల విటమిన్లు ఉన్నాయి.
తృణధాన్యాలతో కలిపి టోస్ట్ అందులో అవకాడో కలిపితే మంచి రుచి వస్తుంది. ఇందులో అవకాడో ఫైబర్ ను కలిగి ఉంది. జీర్ణక్రియకు మంచిది. ఆరోగ్యకరమైన కొవ్వులు, అవకాడో తీసుకోవడం వల్ల ఉదయం పూట కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది.
Viral Video : ఫొటోగ్రాఫర్ కెమెరాకు చిక్కిన టైగర్ పంజా .. !
గుడ్డు టోస్ట్, అవకాడో టోస్ట్ ఏది బెస్ట్..
గుడ్డు టోస్ట్, అవకాడో టోస్ట్ మధ్య పోషకా అవసరాలు, రుచికి ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. మెదడు ఆరోగ్యానికి అధిక ప్రోటీన్ ఎంపిక చూస్తున్నట్లయితే, గుడ్డుటోస్ట్ మంచి ఎంపిక. ఇందులో గుండె ఆరోగ్యానికి స్థిరమైన రక్తంలో చక్కెర స్థాయిలను ప్రోత్సహించే ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్తో మంచి రుచికరమైన అల్పాహారం తయారవుతుంది. ఇవి రెండూ టోస్ట్ ఆరోగ్యకరమైన అల్పాహారంగా మంచి ఎంపికలు, వీటిని సమతుల్య ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.