Viral Video : ఫొటోగ్రాఫర్ కెమెరాకు చిక్కిన టైగర్ పంజా .. !
ABN , Publish Date - Jun 18 , 2024 | 01:15 PM
ఈ మధ్య కాలంలో మహారాష్ట్రాలోని తడోబా నేషనల్ పార్క్ అంధారి టైగర్ రిజర్వ్ నుంచి ఇటీవలి కాలంలో తీసిన ఓ వీడియో విషయానికే వస్తే ఇది జనాల్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
వన్యప్రాణుల ఫోటోగ్రఫీ తరుచుగా మనల్ని కాస్త ఆశ్చర్యానికి గురిచేసే సమయాలు, సందర్భాలు అనేకం కనిపిస్తూ ఉంటాయి. ఈ క్షణాలు మనల్ని విస్మయానికి గురిచేస్తూ ఉంటాయి. ముఖ్యంగా అడవీ ప్రాంతంలో జంతువుల కదలికలను పసిగట్టేందుకు వైల్డ్ ఫోటోగ్రాఫర్స్ నిత్యం శ్రమిస్తూ ఉంటారు. వీరి కెమెరాకు ఒక్కోసారి అద్భుతాలే చిక్కుతాయి. అందులో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మహారాష్ట్రాలోని తడోబా నేషనల్ పార్క్ అంధారి టైగర్ రిజర్వ్ నుంచి ఇటీవలి కాలంలో తీసిన ఓ వీడియో విషయానికే వస్తే ఇది జనాల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. విషయంలోకి వెళితే..
ఫోటోగ్రాఫర్ నిఖిల్ గిరి తన కెమెరాలో బంధించిన ఈ వింత అందరినీ కాసేపు విస్తుపోయేలా చేసింది. మహారాష్ట్రలోని తడోబా నేషనల్ పార్క్, అంధారిలో టైగర్ రిజర్వ్ లో టైగర్ గురించి తీసిన ఈ వీడియో చాలా చిత్రంగా వచ్చింది. నీటిని తాగడానికి వచ్చిన ఈ పులి తన పంజాను పైకి ఊపుతూ, పర్యాటకులను పలకరిస్తూ కనిపించింది.
ఈ వీడియోలో గంభీరమైన పులి, నీటి రిజర్వాయర్ దగ్గర కనిపిస్తుంది. కెమెరా వైపు ఉన్నట్టుండి చూస్తూ దాహం కోసం నీటిని తాగేందుకు వచ్చిన ఈ పులి, కెమెరా వైపు ఉన్నట్టుండి చూస్తూ తన పంజాను ఊపి పలకరిస్తున్నట్టుగా కనిపించింది. ఇది అక్కడివారినే కాదు. ఈ వీడియోను చూసిన వారినీ ఆశ్చర్యపరిచింది. ఈ అద్భుత దృశ్యాన్ని అంధారిలో టైగర్ రిజర్వాయర్ నుంచి సంపాదించానని సోషల్ మీడియాలో నిఖిల్ పోస్ట్ చేసాడు.
Proten Rich Foods : కండరాల పెరుగుదలకు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు ఎంత వరకూ సపోర్ట్ ఇస్తాయి..!
నిఖిల్ గిరి సోషల్ మీడియాలో ఈ వీడియోను పంచుకోగానే వైరల్ అయింది. 1.7 మిలియన్లకు పైగా వీక్షకులు ప్రతిస్పందనలు పంపారు. ఇంటర్నెట్ లో కామెంట్లు వరదలై పొంగాయి.