Baby Massage: అప్పుడే పుట్టిన పిల్లలకు మాసాజ్ కోసం ఏ నూనెను ఎంచుకోవాలి..!
ABN , Publish Date - Jun 21 , 2024 | 04:02 PM
పిల్లలకు మసాజ్ ఆయిల్ ఎటువంటిది ఎంచుకోవాలనే విషయంలో కాస్త తికమక పడతారు. కొబ్బరి నూనెను తీసుకుంటే తేమతో సమృద్ధిగా ఉంటుంది.
అప్పుడే పుట్టిన బిడ్డకు స్నానం చేయించడం అన్నా, మసాజ్ చేయడమన్నా పెద్ద విషయంగా భావిస్తుంటారు. చిన్న పిల్లలను ముట్టుకుని మసాజ్, స్నానం అంటే మాటలు కాదు. పైగా వారి లేత చర్మానికి సరిపడే నూనెలను, సబ్బును ఎంచుకోవడం కూడా పెద్ద సమస్యే. దీనికోసం మన పెద్దవారిని సలహాలు అడిగి తీసుకుంటూ ఉంటాం. అయితే ఇప్పటి రోజుల్లో పెద్దవారి మాటల కన్నా డాక్టర్స్ చెప్పేవే ఎక్కువగా పాటిస్తున్నాం. చిన్న పిల్లల విషయంలో అంత చొరవగా నిర్ణయం తీసుకోలేము. అయితే అప్పుడే పుట్టిన శిశువుకు మాసాజ్ చాలా ముఖ్యం. వారి ఆరోగ్యకరమైన ఎముకలు, కండరాల అభివృద్ధికి ఇది చాలా మంచి ప్రయత్నం. పిల్లలకు రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు మసాజ్ చేస్తూ ఉంటాం. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. కాబట్టి కండరాల సడలింపు, జాయింట్ ఫ్లెక్సిబిలిటీకి కూడా సహకరిస్తుంది.
అయితే ఇక్కడ ముఖ్యమైన సంగతి ఏంటంటే అసలు ఈ పిల్లలకు మసాజ్ ఆయిల్ ఎటువంటిది ఎంచుకోవాలనే విషయంలో కాస్త తికమక పడతారు. కొబ్బరి నూనెను తీసుకుంటే తేమతో సమృద్ధిగా ఉంటుంది. అలాగే తేలికపాటి నూనెతో శిశువుకు మసాజ్ చేయడానికి మంచిది. కొబ్బరి నూనె సున్నితమైన మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉంది. ఆలివ్ నూనె పిల్లలకు వచ్చే దద్దుర్లను నయం చేస్తుంది.
ఆవాల నూనె కూడా మసాజ్ చేసేందుకు మంచి ఎంపిక. ఇందులో కాల్షియం, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది బ్యాక్టీరియల్,ఫంగల్ ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది. శరీరాన్ని వేడిగా ఉంచుతుంది. పిల్లల మసాజ్ కు మంచి నూనే ఆవాల నూనె.
Lose weight : ఈ పొడులతో బరువు తగ్గచ్చా.. ఎంత వరకూ పని చేస్తాయి..!
శిశువుకు మసాజ్ వల్ల ఎముక బలంతో పాటు తల్లిబిడ్డల నిద్ర సమయం కూడా పెరుగుతుంది. దీనితో ఇద్దరూ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. శిశువు ఎదుగుదలకు మసాజ్ ఎంత సహకరిస్తుందో అలాగే తల్లి కాన్పు తర్వాత ఉండే నీరసం, వీక్ నెస్ ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల పోతుంది. గణనీయంగా ఇద్దరూ ఆరోగ్యంగా తయారవుతారు.
పిల్లలకు పాలు, నీళ్ళు, మసాజ్ ఇవే బలం..
మసాజ్ పిల్లల్లో మెరుగైన జీవక్రియకు, రోగనిరోధక శక్తిని పెంచేందుకు మంచి నిద్రను ఇచ్చేందుకు పనిచేస్తుంది. మసాజ్ తర్వాత రిలాక్స్ మూడ్ లోకి వెళతారు పిల్లలు. మంచి నిద్రపోతారు. దీనితో తల్లికి కూడా విశ్రాంతి తీసుకునే సమయం పెరుగుతుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.