Women Health : గర్భం దాల్చిన తర్వాత చర్మ సమస్యలు ఎందుకు వస్తాయ్.. !
ABN , Publish Date - Aug 06 , 2024 | 03:20 PM
గర్భధారణ సమయంలో దురద, దద్దుర్లు, ఎర్రటి పాచెస్ స్ట్రెచ్ మార్క్స్ చుట్టూ ఏర్పడతాయి. బొడ్డు సాగినప్పుడు డెలివరీ చివరిలో చేతులు, కాళ్ళలో ఈ దురదలు ఎక్కువగా ఉంటాయి.
ప్రతి స్త్రీలోనూ గర్భం దాల్చగానే శరీరంలో అనేక మార్పులు కనిపిస్తూ ఉంటాయ్.. చర్మం సాగినట్టుగా, పొట్ట, చేతులు, కాళ్ళ భాగంలో స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. చర్మం నల్లబడటం, ముఖం మీద మొటిమల సమస్య కూడా ఉంటుంది. చర్మం పొడిబారినట్టుగా కనిపిస్తుంది. దీనికి గల మరిన్ని కారణాలను తెలుసుకుందాం.
గర్భధారణ సమయంలో శరీరంలో జరిగే స్పష్టమైన మార్పులతో పాటు హార్మోన్ల పెరుగుదల కూడా చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ చర్మ సమస్యలు డెలివరీ తర్వాత తగ్గే అవకాశాలుంటాయి. కడుపులో పెరుగుతున్న శిశువు కారణంగా చర్మం మీద చారలు ఏర్పడతాయి.
దీనితో పాటు హైపర్పిగ్మెంటేషన్, మెలస్మా, ప్రూరిటిక్ ఉర్టికేరియల్ పాపల్స్, స్కిన్ ట్యాగ్, సోరియాసిస్, పెమ్ఫిగోయిడ్ గర్భధారణ, ఇంట్రాహెపాటిక్ కొలెస్టాసిస్ వంటి కారణాలతో హార్మోన్ల స్థాయిలు కారణంగా ఈ సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, చర్మంలో నూనె శాతం అధికంగా ఉత్పత్తి కావడానికి కారణం అవుతుంది. దీనితో చర్మ సమస్యలు పెరిగి ఇబ్బంది కలిగిస్తాయి.
గర్భధారణ సమయంలో దురద, దద్దుర్లు, ఎర్రటి పాచెస్ స్ట్రెచ్ మార్క్స్ చుట్టూ ఏర్పడతాయి. బొడ్డు సాగినప్పుడు డెలివరీ చివరిలో చేతులు, కాళ్ళలో ఈ దురదలు ఎక్కువగా ఉంటాయి.
Healthy Foods : నానబెట్టిన బాదం, వేరుశెనగలో ఏది ఆరోగ్యానికి మంచిది ?
హైపర్పిగ్మెంటేషన్.. మెలనిన్ పెరుగుదల వలన చర్మం నల్లబడటం, రంగు మారడం జరుగుతుంది.
మెలస్మా.. మెలస్మా అనేది హెపర్పిగ్మెంటేషన్, ఇది ముఖంపై టాన్ లేదా బ్రౌన్ ప్యాచ్‌లను కలిగిస్తుంది. గర్భిణులలో ఇది చాలా సాధారణంగా కనిపించే సమస్య.
ప్రూరిటిక్ ఉర్టికేరియల్ పాపల్స్.. ఇది చర్మంపై లేత ఎరుపు గడ్డలుగా ఏర్పడుతుంది. దురద, కాలిన మచ్చలుగా ఉండి చికాకు కలిగిస్తుంది. గర్భధారణ సమయంలో పొట్ట, కాళ్ళు, చేతులు, పిరుదులపై కనిపిస్తాయి.
Health Tips : ఈ గింజలు తింటే శరీరానికి బోలెడు ఐరన్ ..!
చర్మం చారలు.. పెరుగుతున్న గర్భం బరువు కారణంగా సాగిన చర్మం చారలుగా కనిపిస్తుంది. వీటిని స్ట్రెచ్ మార్క్స్ అనిపిలుస్తారు. ఇవి ఊదా రంగులో, లేత గులాబి రంగులో కనిపిస్తాయి.
మొటిమలు, సోరియాసిస్, అటోపిక్ డెర్మటైటిస్ ఈ పరిస్థితులన్నీ గర్భధారణతో మొదలై, బిడ్డ పుట్టిన తర్వాత తగ్గుతాయి.
బిడ్డను ప్రసవించిన తర్వాత ఈ సమస్యలలో చాలా వరకు క్లియర్ అవుతాయి, అయితే వాటిలో కొన్ని మెలస్మా, మొటిమలు, జుట్టు రాలడం వంటివి డెలివరీ తర్వాత కూడా కొనసాగుతాయి. గర్భధారణ సమయంలో ఈ చర్మ సమస్యలను గమనించిన తర్వాత తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.