Share News

Healthy Foods : నానబెట్టిన బాదం, వేరుశెనగలో ఏది ఆరోగ్యానికి మంచిది ?

ABN , Publish Date - Aug 05 , 2024 | 04:15 PM

బాదం, వేరుశనగ రెండింటిలో కేలరీలు అధికంగా ఉంటాయి. బాదం, వేరుశనగలో క్యాలరీల విషయంగా చాలా పోలిక ఉంటుంది. బాదంలో 100 గ్రాములకు 579 కేలరీలు ఉంటే వేరుశెనగలో 587 కేలరీలున్నాయి.

Healthy Foods : నానబెట్టిన బాదం, వేరుశెనగలో ఏది ఆరోగ్యానికి మంచిది ?
Health Benefits

వేరుశనగ గింజలు చాలా ఆరోగ్యకరమైన పోషకాలను కలిగి ఉంటాయి. వీటిలో ఉన్న కొవ్వులు, ఫైబర్, పొటాషియం, ఫాస్పరస్, బి విటమిన్లు, మెగ్నీషియం శరీరానికి అధిక బలాన్ని అందిస్తాయి. ఆరోగ్యకరమైన స్నాక్‌గా కూడా వేరుశనగల్ని తీసుకోవచ్చు. ఇవి ముఖ్యంగా రక్త వృద్ధికి సహకరిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారి డైట్లో వేరుశనగలు తప్పక ఉండాల్సిందే. ఈ పచ్చి గింజల్ని వేయించి తీసుకోవచ్చు. లేదంటే బెల్లంతో కలిపి తీసుకున్నా కూడా రుచిగా ఉంటాయి. వేరుశనగ చిక్కీ పిల్లలకు, పెద్దలకూ అందరికీ నచ్చే విధంగా రుచిగా ఉంటుంది. వేరుశనగ గింజలు చట్నీలు, తాలింపుల్లో, ఉప్మాలో ఇలా చాలా పదార్థాల్లో తీపి, కారం అనే బేధం లేకుండా రుచిగా ఉంటాయి. వేరుశనగ గింజలు తక్కువ ధరల్లో దొరుకుతుంది.

శరీరానికి శక్తి అనే మాట రాగానే మనం తినేందుకు ఎంచుకునే గింజల్లో బాదం ముందుంటుంది. బాదంపప్పులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి. దీనికి తగినట్టుగానే బాదం రేటు కూడా కాస్త ఎక్కువే ఉంటుంది. ఈ పప్పును రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటూ ఉంటారు. బాదం స్వీట్స్ మరింత రుచిగా ఉంటాయి. బాదం పొడి, బాదం నూనె ఇలా ప్రతీది కాస్త ఎక్కువ ఖరీదులోనే దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ రోజుకు నాలుగు నుంచి ఆరు బాదం పప్పులు తింటే శక్తి స్థాయిలు తగ్గవనేది వైద్యులు చెప్పే మాట. నానబెట్టిన బాదం, వేరుశనగ గింజలు వీటిలో ఏది బెస్ట్.. ఎందులో పోషకాలు అధికంగా ఉన్నాయి తెలుసుకుందాం.

నానబెట్టిన వేరుశనగలు..

రాత్రి నానబెట్టిన వేరుశనగ గుళ్ళు కాస్త ఉబ్బి చిన్నగా మొలక వస్తాయి. ఇందులో విటమిన్ ఎ ఉంటుంది. వీటిని తీసుకుంటే వ్యాయామం చేసేవారికి, బాడీబిల్డింగ్ చేస్తున్నవారికి మంచి ప్రోటీన్ ఆహారంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే కార్డియో ప్రొటెక్టివ్ గుణం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మెదడు ఆరోగ్యానికి మంచిది. శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది. అలాగే రక్తప్రసరణను అందించడంలో సహాయపడుతుంది.


Health Tips : వానాకాలంలో జలుబు, దగ్గుకు లవంగాలతో చెక్ పెట్టేదెలా..!

రాత్రి నానబెట్టిన బాదంపప్పును పిల్లలు పెద్దలూ తీసుకోవడం వల్ల శరీరానికి పోషకాల కొరత ఉండదు. బాదం, వేరుశనగలు రెండింటిలోనూ కాల్షియం, కేలరీలు, డైటరీ ఫైబర్, పొటాషియం, ప్రోటీన్లు అధికంగా ఉన్నాయి. బాదంపప్పులో ఎక్కువ రిబోఫ్లావిన్ ఉంటుంది. ఇందులో విటమిన్ ఇ, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.

వేరుశనగ, బాదం రెండింటిలో పోషకాలు, వ్యత్యాసాల విషయానికి వస్తే..

బాదం, వేరుశనగ రెండింటిలో కేలరీలు అధికంగా ఉంటాయి. బాదం, వేరుశనగలో క్యాలరీల విషయంగా చాలా పోలిక ఉంటుంది. బాదంలో 100 గ్రాములకు 579 కేలరీలు ఉంటే వేరుశెనగలో 587 కేలరీలున్నాయి.


Health Tips : జికా వైరస్ అంటే ఏమిటి? దోమకాటును నివారించాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి..!

మాక్రోన్యూటిరియెంట్ నిష్పత్తుల విషయానికి వస్తే వేరుశనగలో ప్రోటీన్, పిండి పదార్థాలు, కొవ్వులు బాదంపప్పుల మాదిగానే ఉంటాయి. వేరుశనగలో స్థూల పోషకాల నిష్పత్తి 16:13:71, బాదంపప్పులలో 14:14:73 ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కేలరీలు, కొవ్వు పదార్థాలున్నాయి.

వేరుశనగలో ప్రోటీన్లు 16 శాతం ఉంటే, బాదంలో 14 శాతం ఉన్నాయి.

వేరుశనగలో కార్బోహైడ్రేట్లు 13 శాతం ఉంటే, బాదంలో 13 శాతం ఉన్నాయి.

కొలెస్ట్రాల్ స్థాయిలు వేరుశనగలో 71 శాతం ఉంటే, బాదంలో 73 శాతం ఉన్నాయి.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Aug 05 , 2024 | 04:15 PM