Share News

Health Tips : ఆహారంలో వెన్న ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుంది.

ABN , Publish Date - Aug 09 , 2024 | 01:31 PM

వెన్నలో విటమిన్లు ఎ, డి, ఇ, కె పుష్కలంగా ఉన్నాయి. ఇవి మొత్తం ఆరోగ్యానికి సహకరిస్తాయి. వెన్న తినడం వల్ల తక్షణమే శరీరానికి కావలసిన శక్తి అందుతుంది.

Health Tips : ఆహారంలో వెన్న ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుంది.
Health Benefits

వెన్న ఆరోగ్యానికి మంచిది. పాల ఉత్పత్తుల్లో పెరుగు, వెన్న, నెయ్యి ఇవి ఆరోగ్యాన్ని పెంచేవి. శరీర ఇన్ఫెక్షన్లను తొలగించడానికి వెన్నలోని లూరిక్ యాసిడ్ బాగా పనిచేస్తుంది. రోజు వారి ఆహారంలో వెన్నను చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. ఇందులోని కాల్షియం కంటెంట్ ఎముక బలాన్ని, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. వెన్నలో మోనోశాచురేటెడ్ కొవ్వులు శక్తిని అందిస్తాయి.

కణాల పెరుగుదలకు సహకరిస్తాయి. విటమిన్ ఇ సమృద్ధిగా ఉన్న వెన్నలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని పెంచుతాయి. వెన్న అతిగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగదు. వెన్న థైరాయిడ్ హార్మోన్లను సమతుల్యం చేయడానికి, జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. ఇంకా వెన్నను రోజువారి ఆహారంలో తీసుకోవడం వల్ల కలిగే లాభాలను తెలుసుకుందాం.

వెన్నలో విటమిన్లు ఎ, డి, ఇ, కె పుష్కలంగా ఉన్నాయి. ఇవి మొత్తం ఆరోగ్యానికి సహకరిస్తాయి. వెన్న తినడం వల్ల తక్షణమే శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. వెన్నలోని ఫ్యాట్ పిల్లల మెదడు పెరుగుదలను, నరాల్లో బలాన్ని పెంచుతుంది. ఇందులోని అరాచిడోనిక్ యాసిడ్ మెదడు శక్తివంతంగా పనిచేసేట్టు చేస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు వెన్నను రోజూ తీసుకోవాలి. స్త్రీలలో సంతానోత్పత్తి అవకాశాలను పెంచుతుంది. జీర్ణక్రియకు అవసరమైన లెసిథిన్ అందించి, రక్తప్రసరణను సాఫీగా చేస్తుంది.

1. వెన్నలో చక్కెర లేదా తేనె కలిపి ప్రతిరోజూ తీసుకుంటే శరీరానికి పోషకాల లోటు ఉండదు. శరీరంలో వ్యర్థాలు తొలగిపోతాయి.

2. వెన్నలో పాల కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ HDL స్థాయిలను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.


Festival Time : హరియాలీ తీజ్ వేడుకల్లో ఖీర్ ఎందుకు చేస్తారు?

3. కొలెస్ట్రాల్ నియంత్రణలో భాగంగా వెన్న ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలు పెంచి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

4. పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ ఎ, డి కలిగిన వెన్న మృదువైన చర్మాన్ని ఇస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.


Health Tips : ఖాళీ కడుపుతో ఉదయాన్నే నీరు తాగడం ఆరోగ్యమేనా..!

5. ఇంట్లో తయారు చేసిన వెన్నకు, ప్రాసెస్ చేసిన వెన్నకు కొద్ది తేడాలు ఉంటాయి. ఈ వెన్న హెచ్ డి ఎల్ కొలెస్ట్రాల్‌ను పెంచినప్పటికీ, అధికంగా తీసుకుంటే శరీరం బరువును కూడా పెంచుతుంది.

6. ప్రాసెస్ చేసిన వెన్నతో పోలిస్తే ఇంట్లో తయారుచేసిన వెన్న అధిక స్మోక్ పాయింట్‌ను కలిగి ఉంటుంది. వంటకాలకు ప్రాసెస్ చేసిన వెన్న అనుకూలంగా ఉంటుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Aug 09 , 2024 | 01:31 PM