Summer Food : వేసవిలో శరీరం కూల్ కావాలంటే కీరా ఒక్కటి చాలు..!
ABN , Publish Date - May 01 , 2024 | 04:01 PM
జీర్ణ క్రియకు కీర మంచిది. ఇందులోని డైటరీ ఫైబర్ మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
వేసవిలో ఏ ఆహారం తీసుకున్నా అది శరీరానికి చలవ చేసేదిగా, బలాన్ని ఇచ్చేదిగా ఉండాలి. మజ్జిగ, పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్, పండ్లు, ఐస్ క్రీమ్, సలాడ్స్ ఇలా ప్రతీది చల్లగా ఉంచేవే తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే బయటి ఎండలను తట్టుకునే శక్తిని ఇవ్వాలి కదా. చల్లగా ఉంచే ఆహారాన్నే తీసుకోవాలి. వాటిలో మనం ఎక్కవగా తీసుకనే కీరాను తీసుకుంటే ఎండ వేడిని తట్టుకునేలా చేస్తుంది. సొరకాయ జాతికి చెందిన ఈ కీరాలో విటమిన్ సి, పోటాషియం, ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలున్నాయి. ఇవి రోగ నిరోధక శక్తిని, కంటి దృష్టి, గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇంకా కీరాతో ఎన్ని ప్రయోజనాలంటే..
బరువు తగ్గించడంలో..
గుమ్మడికాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు మెయింటెయిన్ చేయడానికి మంచి ఎంపిక. అదనపు కేలరీలను కలిగి ఉండటం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది.
హైడ్రేట్‌గా ఉంచుతుంది.
కీరాలో అధిక నీటి కంటెంట్ ఉంటుంది. ఇది హైడ్రేట్‌గా ఉంచుతుంది.
Energy Levels : శక్తిలేనట్టుగా, అలసటగా ఉంటే తిరిగి శక్తిని పొందేందుకు ఇలా చేయండి..!
జీర్ణక్రియకు..
జీర్ణ క్రియకు కీర మంచిది. ఇందులోని డైటరీ ఫైబర్ మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు..
కీరలో విటమిన్ సి, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించి శరీర కణాలను రక్షిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Health Tips : షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన వేసవి పానీయాలు ఇవే..!
గుండెకు..
గుండె ఆరోగ్యానికి కీరాలో ఉండే పొటాషియం మేలు చేస్తుంది. కండారాలకు, నరాల పనితీరుకు మద్దతు ఇస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
కంటి ఆరోగ్యం.
కీరాలో విటమిన్ ఎ, ల్యూటిన్ ఉండటం వల్లకంటి ఆరోగ్యానికి మంచిది. వయస్సుతో వచ్చే మచ్చలను తగ్గించడంలో కూడా కీరా చక్కగా పనిచేస్తుంది.
Read Latest Navya News and Thelugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.