Share News

Healthy food : వీటిలో ప్రొటీన్‌ పుష్కలం!

ABN , Publish Date - Nov 05 , 2024 | 12:24 AM

మాంసాహారంలోనే కాదు శాకాహారంలోనూ మాంసకృత్తులు ఉంటాయి. ఈ పోషకాలు ఎక్కువ పరిమాణంలో ఉండే పదార్థాల గురించి తెలుసుకుని క్రమం తప్పక తింటూ ఉంటే బలహీనత దరి చేరదు.

Healthy food : వీటిలో ప్రొటీన్‌ పుష్కలం!

హెల్తీ ఫుడ్‌

మాంసాహారంలోనే కాదు శాకాహారంలోనూ మాంసకృత్తులు ఉంటాయి. ఈ పోషకాలు ఎక్కువ పరిమాణంలో ఉండే పదార్థాల గురించి తెలుసుకుని క్రమం తప్పక తింటూ ఉంటే బలహీనత దరి చేరదు.

  • చిక్కుళ్లు: ఒక కప్పు చిక్కుళ్లలో 15 గ్రాములు ప్రొటీన్లు ఉంటాయి. పీచు, ఫోలేట్‌, ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీసు మొదలైన ఖనిజ లవణాలు చిక్కుళ్లలో ఉంటాయి. ఈ పోషకాలు సమృద్ధిగా అందాలంటే చిక్కుళ్లను వేయించకుండా ఆవిరి మీద ఉడికించుకుని లేదా కూరగా, స్టిర్‌ ఫ్రై రూపంలో తినాలి.

  • సబ్జా: 30 గ్రాముల సబ్జాలో 4 గ్రాములు ప్రొటీన్‌ ఉంటుంది. క్యాల్షియం, ఫైబర్‌, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం కూడా సబ్జాలో ఉంటాయి. స్మూదీ, సలాడ్స్‌, సూప్స్‌ లేదా నీళ్లలో నానబెట్టి తీసుకోవచ్చు.

  • క్వినోవా: ఒక కప్పు క్వినోవాలో 8 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది. వీటిలో మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, మాంగనీసు కూడా ఉంటాయి. అన్నం బదులుగా తినవచ్చు.

Updated Date - Nov 05 , 2024 | 12:24 AM