Share News

Home Making Tips: బాత్రూమ్‌ నుంచి గబ్బు వాసన వస్తోందా? ఇలా చేస్తే అస్సలు దర్వాసన రాదు..!

ABN , Publish Date - May 19 , 2024 | 12:52 PM

బాత్‌రూమ్‌ నుంచి వచ్చే దుర్వాసన మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంటుంది. ఈ దుర్వాసన కారణంగా ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉంటుంది. అంతేకంటే ప్రమాదకరం ఏంటంటే.. వ్యాదుల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే.. బాత్రూమ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాస్తవానికి బాత్రూమ్‌లోని సింక్, ఇంతర ప్రాంతాల నుంచి ఈ దుర్వాసన వస్తున్నట్లయితే..

Home Making Tips: బాత్రూమ్‌ నుంచి గబ్బు వాసన వస్తోందా? ఇలా చేస్తే అస్సలు దర్వాసన రాదు..!
Home Making Tips

Bathroom Cleaning Tips: బాత్‌రూమ్‌ నుంచి వచ్చే దుర్వాసన మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంటుంది. ఈ దుర్వాసన కారణంగా ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉంటుంది. అంతేకంటే ప్రమాదకరం ఏంటంటే.. వ్యాదుల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే.. బాత్రూమ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాస్తవానికి బాత్రూమ్‌లోని సింక్, ఇంతర ప్రాంతాల నుంచి ఈ దుర్వాసన వస్తున్నట్లయితే.. పబ్లింగ్‌లో సమస్య ఉండే అవకాశం అందుకే.. ముందుగా అసలు సమస్య ఏంటో గుర్తించి.. దానిని పరిష్కరించాలి. బాత్రూమ్ నుంచి దుర్వాసన రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..


ప్లంబింగ్ చెక్ చేయాలి..

మీ బాత్‌రూమ్‌లో నిరంతర వాసన వస్తున్నట్లయితే.. ముందుగా ప్లంబర్‌ని పిలిచి ప్లంబింగ్‌ను తనిఖీ చేయాలి. సింక్‌లో లేదా డ్రైనేజీ పైపులో చెత్త పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ప్లంబర్ ఆ పైప్‌లో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తారు. తద్వారా అది శుభ్రమై దుర్వాసన రాకుండా ఉంటుంది. అవసరమైతే పాత పైపులను మార్చేసి.. కొత్తవి ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం.


సరైన వెంటిలేషన్..

బాత్రూమ్ నుండి చెడు వాసనను తొలగించడానికి సరైన వెంటిలేషన్, సూర్యకాంతి ఉండటం చాలా ముఖ్యం. బాత్రూంలో సహజ కాంతి రాలేకపోతే.. కనీసం వెంటిలేషన్ విషయంలో జాగ్రత్త వహించాలి. వాస్తవానికి చాలా ఇళ్లలో వెంటిలేషన్ సరిగా లేని ప్రదేశాలలో స్నానపు గదులు నిర్మిస్తుంటారు. అలాంటి పరిస్థితిలో.. బాత్రూమ్‌లో ఎగ్జాస్ట్ ఫ్యాన్, విండో అమర్చడం ఉత్తమం. తద్వారా బాత్రూంలోకి స్వచ్ఛమైన గాలి వస్తుంది. చెడు వాసన బయటకు వెళ్తుంది.


టాల్కమ్ పౌడర్..

టాల్కమ్ పౌడర్‌ను టాయిలెట్ పాట్‌లో వేయడం వల్ల కూడా దుర్వాసన తొలగిపోతుంది. దీని కోసం, సింక్‌లో తగిన మొత్తంలో టాల్కమ్ పౌడర్ వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఇలా చేస్తే దుర్వాసన తొలగిపోతుంది. అలాగే, ఉదయం సమయంలో సాధారణ టాయిలెట్ క్లీనర్‌లో సింక్‌ను శుభ్రం చేయాలి.


డిటర్జెంట్ పౌడర్, బేకింగ్ సోడా, క్లీనర్ పేస్ట్..

రెండు టీస్పూన్ల డిటర్జెంట్ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఒక టేబుల్ స్పూన్ హార్పిక్ (లేదా ఏదైనా ఇతర బాత్రూమ్ క్లీనర్) తీసుకొని పేస్ట్ చేయండి. దీన్ని కొన్ని నీళ్లలో వేసి బాత్రూమ్‌ సింక్‌పై వేసి 10-25 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత సింక్‌ను శుభ్రం చేయాలి. అయితే, ఇలా చేసేటప్పుడు మీ చేతులకు తప్పకుండా హ్యాండ్ గ్లౌజ్‌లు ధరించాలి.


ఫ్లష్ ట్యాంక్‌ను శుభ్రం చేయడం..

చాలా సార్లు టాయిలెట్ దుర్వాసనకు అసలు కారణం ఫ్లష్ ట్యాంక్. ఫ్లష్ ట్యాంక్‌లో నీరు కుళ్లిపోవడం వల్ల దుర్వాసన వస్తుంది. ఫ్లష్ ట్యాంక్‌ను నెలకోసారి శుభ్రం చేయడం కూడా అవసరం. ఇది దుర్వాసన కారణాన్ని తొలగిస్తుంది. మీ టాయిలెట్ తాజాగా ఉంటుంది.


బాత్‌రూమ్‌ని రోజువారీ శుభ్రపరచడం..

బాత్రూమ్‌ను వాసన లేకుండా ఉంచడానికి ఉత్తమ మార్గం ప్రతిరోజూ శుభ్రం చేయడం. రోజూ టాయిలెట్‌ని శుభ్రం చేయండి. క్లీనింగ్ ఏజెంట్లను ఉపయోగించండి. కనీసం వారానికి ఒకసారి డీప్ క్లీనింగ్ చేయండి. ఇది బాత్రూంలో దుర్వాసనను నివారిస్తుంది. మీ ఇల్లు ఎల్లప్పుడూ శుభ్రంగా, తాజాగా ఉంటుంది.

For More Lifestyle News and Telugu News..

Updated Date - May 19 , 2024 | 12:52 PM