Share News

kitchen work : స్మార్ట్‌ కిచెన్‌...

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:33 AM

మహిళలకు వంటింటి పనుల్లో చేదోడుగా నిలించేందుకు కొన్ని స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ మార్కెట్లోకొచ్చేశాయి. వేడి పాత్రలను సింపుల్‌గా స్టౌ మీద నుంచి దించాలన్నా, వెల్లుల్ని చకచకా రోస్ట్‌ చేయాలన్నా, టమాటో ముక్కలు సరిగ్గా కట్‌ చేయాలన్నా ఇకపై చిటికెలో పని. మరి ఇంతకీ ఆ స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ ఏంటో చూద్దామా..

kitchen work : స్మార్ట్‌ కిచెన్‌...

మహిళలకు వంటింటి పనుల్లో చేదోడుగా నిలించేందుకు కొన్ని స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ మార్కెట్లోకొచ్చేశాయి. వేడి పాత్రలను సింపుల్‌గా స్టౌ మీద నుంచి దించాలన్నా, వెల్లుల్ని చకచకా రోస్ట్‌ చేయాలన్నా, టమాటో ముక్కలు సరిగ్గా కట్‌ చేయాలన్నా ఇకపై చిటికెలో పని. మరి ఇంతకీ ఆ స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ ఏంటో చూద్దామా..

  • గరిటకు రెస్ట్‌..

రోజూ వంట చేసే క్రమంలో ఆయా పదార్థాల్ని కలపడానికి వేర్వేరు గరిటలు వాడుతుంటాం. పనైపోయాక వాటిని స్టౌ మీదనో లేదో ప్లాట్‌ఫామ్‌ మీదో గబగబా పెట్టస్తుంటాం. దీనివల్ల ఆ ప్రదేశమంతా నూనె మరకలు పడి అపరిశుభ్రంగా తయారవుతుంది. అందుకే ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికి ‘స్పూన్‌ రెస్ట్‌ హోల్డర్‌’ మార్కెట్లోకొచ్చేశాయి. వీటిలో గరిట మాత్రమే కాదు పాత్రలపై పెట్టే మూతల్ని అమర్చుకునే సౌకర్యం కూడా ఉంది.


Untitled-1 copy.jpg

  • గార్లిక్‌ రోస్టర్‌

వెల్లుల్ని రోస్ట్‌ చేయడం కాస్త కష్టంతో కూడుకున్నదే. వాటిని పొయ్యి మీద లేదా ఓవెన్‌లో కాల్చాలన్నా ఆరంతం వెల్లుల్లి వాసనే వస్తుంది. అందుకోసమే ప్రత్యేకించి ఈ ‘గార్లిక్‌ రోస్టర్‌’ అందుబాటులోకి వచ్చింది. ఈ ఎలకా్ట్రనిక్‌ పరికరంలో వెల్లుల్లి చివరలు కత్తిరించి కాస్త వంటనూనె లేదా ఆవనూనె గానీ వెయ్యాలి. అవసరమైతే పెప్పర్‌, సాల్ట్‌ చల్లి మూత పెట్టేకొని, ముందరున్న బటన్‌ని ఆన్‌ చేస్తే చాలు. అదే చక్కగా కాలతాయి. 30 నిమిషాల్లోనే గ్లారిక్‌ రోస్ట్‌ రెడీ అవుతుంది.


Untitled-1 copy.jpg

  • చేతులు కాలవిక

స్టౌ మీద నుంచి వేడి పాత్రలను దించడానికి చాలామంది క్లాత్స్‌ ఉపయోగిస్తుంటారు. అయితే ఒక్కోసారి వాటిని ఉపయోగించినా చేతులు కాలుతుంటాయి. ఆ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఈ ‘కుకింగ్‌ గ్లోవ్స్‌’ బాగా ఉపయోగపడతాయి. వీటి సాయంతో చేతులు కాలకుండా వేడి గిన్నెల్ని కిందకు దించొచ్చు. సిలికాన్‌ మెటీరియల్‌తో తయారైన ఈ గ్లోవ్స్‌ విభిన్న రంగుల్లో మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉడికిన గుడ్లు బయటకు తీసేందుకు, ఓవెన్‌లో బేకింగ్‌ ట్రేలు పెట్టేటప్పుడు, తీసేటప్పుడు కూడా వాడొచ్చు. ఇవి పూర్తిగా ఉష్ణ నిరోధకంగా పనిచేస్తాయి. పైగా శుభ్రం చేయడమూ తేలికే.


Untitled-1 copy.jpg

  • చకచకా తరగొచ్చు

ఉల్లిపాయలు, టమాటో ముక్కలను వేగంగా కోసేటప్పుడు అవి కొంచెం పక్కకు కదిలిపోతూ ఇబ్బంది పెడుతుంటాయి. అలా కదలకుండా ఉండేందుకు ఈ ‘వెజిటబుల్‌ స్లైసర్‌’ చక్కగా ఉపయోగపడుతుంది. దీనిని వాడడం కూడా తేలికే. రెండు హ్యాండిల్స్‌ మధ్యలో టమాటో లేదా బంగాళదుంప లేదా ఉల్లిపాయను పెట్టి కాస్త గట్టిగా నొక్కి పట్టుకుంటే అవి స్థిరంగా ఉంటాయి. అప్పుడిక ముక్కలు చకచకా తరగొచ్చు.

Updated Date - Sep 21 , 2024 | 12:33 AM