Story: బద్ధకపు జింక
ABN , Publish Date - Jun 04 , 2024 | 11:27 PM
ఒక అడవిలో ఉన్న కొలను వద్ద ఒక జింక మరియు కుందేలు కలిసి మెలిసి ఉండేవి, ఆ కుందేలు చాలా చురుకైనది. ఈ మాట అక్కడ మిగతా జంతువులు అన్నీ అంటూ ఉండేవి.
ఒక అడవిలో ఉన్న కొలను వద్ద ఒక జింక మరియు కుందేలు కలిసి మెలిసి ఉండేవి, ఆ కుందేలు చాలా చురుకైనది. ఈ మాట అక్కడ మిగతా జంతువులు అన్నీ అంటూ ఉండేవి. జింక మాత్రం ఆహారం సంపాదించుకోవడానికి తప్ప పెద్దగా చురుగ్గా ఎటూవెళ్లేది కాదు. కానీ జింకకు తాను కుందేలుకంటే చురుకైనదాన్ని అని చాలా నమ్మకం.
ఈచర్చలో భాగంగానే ఒక రోజు ఆ రెంటికీ మిగతా జంతువులన్నీ కలిసి ఒక పోటీ పెట్టాయి. ఒక చోట రెండు దుంపలను దాచిపెట్టి, ఆ దుంపలను ఎవరు ముందుగా వెతికి తెస్తే వారే ఎక్కువ చురుకైన వారు అన్నాయి జంతువులన్నీ.
దీనికి కుందేలు మరియు జింక కూడా సరేనన్నాయి. పోటీ మొదలైంది. జింక కాసేపు తిరిగి, ఇంత పెద్ద ప్రదేశంలో అంత చిన్నదుంపలను వెతకడం కష్టం అని ఒక చెట్టు తొర్ర దగ్గర కూర్చుండిపోయింది. కాసేపటి తర్వాత లేచి వెళ్లి నాకే దొరకలేదంటే ఆ దుంపలు అంత చిన్న కుందేలుకు అసలు దొరకవు.
ఇందులో ఏదో మోసం ఉన్నట్టుంది అన్నది. కానీ కుందేలు చకచకా చుట్టూచూసి వచ్చి దుంపలను తీసుకొచ్చింది. తీరా చూస్తే ఆ రెండు దుంపలు జింక కూర్చున్న చెట్టు తొర్రలోనే ఉన్నాయి. అయ్యో నా బద్ధకం వల్ల కనీసం పక్కకు తిరిగి చూడకుండా కూర్చుని పందెం ఓడిపోయాను అని విచారించింది జింక.