Navya : లోభత్వానికి ఫలితం
ABN , Publish Date - Jul 12 , 2024 | 12:07 AM
దానం భోగో నాశ స్తిస్రో గతయో భవన్తి విత్తస్యయోన దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి...
సుభాషితం
దానం భోగో నాశ స్తిస్రో గతయో భవన్తి విత్తస్యయోన దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి... అంటూ లోభత్వం వల్ల కలిగే అనర్థం గురించి తన ‘నీతిశతకం’లోని ఈ శ్లోకంలో భర్తృహరి వివరించాడు.
దాన్ని...
దానము భోగము నాశము
పూనికతో మూడు గతులు భువి ధనమునకున్
దానము భోగము నెరుగని
దీనుని ధనమునకు గతి ద్రుతీయమె పొసగన్... అనే పద్యరూపంలో తెలుగులో అందించాడు ఏనుగు లక్ష్మణకవి.
భావం:
డబ్బు ఖర్చు కావడానికి మూడు మార్గాలు ఉన్నాయి. మొదటిది: ఎవరికైనా దానం చేయడం. రెండోది: తాను అనుభవించడం. మూడోది: అది నాశనం కావడం. ఎవరికీ దానం చేయకుండా, తాను ఖర్చు పెట్టి సుఖపడకుండా లోభత్వంతో దాచిన ధనం చివరకు ఎందుకూ కొరగాకుండా పోతుంది, నాశనమైపోతుంది, దొంగల పాలు అవుతుంది. దానాన్నీ, భోగాన్నీ ఎరుగని వాడి సంపదకు చివరికి దుర్గతే పడుతుంది.