Share News

Detoxifying : బొప్పాయితో బోలెడు ఆరోగ్యం

ABN , Publish Date - Oct 27 , 2024 | 04:55 AM

అంత తియ్యగా కాకుండా ప్రత్యేకమైన రుచితో ఉండే బొప్పాయి పండుని ఇష్టపడనివారుండరు. ఉదయాన్నే పరగడుపున తినదగ్గ పండ్లలో బొప్పాయి ఒకటి.

Detoxifying : బొప్పాయితో బోలెడు ఆరోగ్యం

అంత తియ్యగా కాకుండా ప్రత్యేకమైన రుచితో ఉండే బొప్పాయి పండుని ఇష్టపడనివారుండరు. ఉదయాన్నే పరగడుపున తినదగ్గ పండ్లలో బొప్పాయి ఒకటి. ఇది శరీరాన్ని డీటాక్స్‌ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఏడాది పొడవునా దొరికే బొప్పాయి పండు అందించే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం!

  • ఉదయాన్నే ఒక కప్పు బొప్పాయి పండు ముక్కలు తింటే ఇందులోని ఫైబర్‌ వల్ల తొందరగా ఆకలి అనిపించదు. పొట్ట చుట్టూ పేరుకున్న క్రొవ్వు కరగడంతో పాటు అధిక బరువును నివారిస్తుంది. జీర్ణ క్రియను మెరుగుపరచి కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.

  • బొప్పాయిలో ఉండే కెరోటినాయిడ్స్‌, లైకోపీన్‌ తదితర యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి క్యాన్సర్‌ కణాలను అడ్డుకుంటాయి. అల్జీమర్స్‌, మధుమేహం, కాలేయ వ్యాధులు, థైరాయిడ్‌ సమస్యలను నివారిస్తాయి. మహిళల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌, గర్భాశయ క్యాన్సర్‌ రాకుండా చేస్తాయి. ఈ పండులోని బీటా కెరోటిన్‌ పురుషుల్లో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను నిరోధిస్తుంది.

  • ఒక గ్లాస్‌ బొప్పాయి పండు జ్యూస్‌లో కొంచెం నిమ్మరసం కలిపి రోజుకి రెండు లేదా మూడు సార్లు తాగితే డెంగ్యూ జ్వరం, మలేరియాల నుంచి బయటపడవచ్చు. బొప్పాయి చెట్టు ఆకుల రసాన్ని పూటకి ఒక చెంచా చొప్పున తాగితే రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది.

  • బాగా పండిన బొప్పాయిలో కాల్షియం సమృద్దిగా ఉంటుంది. ఇది ఎముకలకు బలానిస్తుంది. ఇందులో లభించే సి విటమిన్‌ వల్ల దంతాలు, చిగుళ్ల సమస్యలు; బి విటమిన్‌ వల్ల నోటి పూత, పెదాల పగుళ్లు; ఎ విటమిన్‌ వల్ల కంటి జబ్బులు తొలగిపోతాయి.

  • బొప్పాయి పండును తరచూ తినడం వల్ల ఇందులోని ఇ విటమిన్‌ చర్మం ముడుతలు పడకుండా నివారిస్తుంది. చర్మం మీద మృత కణాలను తొలగించి మెరిసేలా చేస్తుంది. కాలిన గాయాలను త్వరగా తగ్గిస్తుంది.

  • ప్రతి రోజూ అల్పాహారంలో బొప్పాయి పండు ముక్కలు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని న్యూట్రియెంట్స్‌, పొటాషియం, మెగ్నీషియం, ఇతర మినరల్స్‌ రక్త ప్రసరణను వేగవంతం చేస్తాయి. ఈ పండులో సుగర్‌ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది..

Updated Date - Oct 27 , 2024 | 04:55 AM