Share News

Parenting : పిల్లలు గొడవపడుతుంటే..

ABN , Publish Date - Sep 22 , 2024 | 05:05 AM

ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఫైటింగ్స్‌కి కొదువుండదు. వాళ్లను సముదాయుంచడం తల్లిదండ్రులకు రోజూ సవాలుగానే ఉంటుంది. ఈ విషయంలో పేరెంటింగ్‌ ఎక్స్‌పర్ట్స్‌ చేస్తున్న సూచనలు ఇవి...

Parenting : పిల్లలు గొడవపడుతుంటే..

పేరెంటింగ్‌

ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఫైటింగ్స్‌కి కొదువుండదు. వాళ్లను సముదాయుంచడం తల్లిదండ్రులకు రోజూ సవాలుగానే ఉంటుంది. ఈ విషయంలో పేరెంటింగ్‌ ఎక్స్‌పర్ట్స్‌ చేస్తున్న సూచనలు ఇవి...

  1. పిల్లలు గొడవపడినప్పుడు ‘‘వాళ్లు చూడు ఎంత బాగా కలిసుంటారో, ఎంత బాగా చదువుకుంటారో’’ అంటూ ఇతర పిల్లలతో ఎప్పుడూ పోల్చవద్దు. ఇంట్లో పిల్లలతో కూడా పోల్చకూడదు.

  2. పిల్లలు ఏ విషయంలో దెబ్బలాడుకుంటున్నారో గమనించాలి. గొడవకు కారణం ఎవరో తెలుసుకోవాలి. ఒక సందర్భంలోనే కాకుండా ఇండివిడ్యువల్‌ అటెన్షన్‌ పెట్టి పరిశీలించాలి.

  3. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే వాళ్లను వేర్వేరుగా కూర్చోబెట్టాలి. ఒకేరూమ్‌లో కూర్చోబెట్టినప్పుడు గొడవ పడటానికి అవకాశం ఉంటుంది.

  4. పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ల విషయంలో తరచుగా గొడవపడుతుంటారు. ఒకరివి మరొకరు తీసుకోకుండా పేరెంట్స్‌ గమనించాలి.

  5. పిల్లలకు ఒకరినొకరు గౌరవించడం నేర్పించాలి. కోపంలో కూడా అగౌరవపరిచేలా తిట్టుకోకూడదని గట్టిగా చెప్పాలి. పిల్లలు కొట్లాడుకునే సమయంలో ఒకరినొకరు తిట్టుకోవడం చూస్తూనే ఉంటాం. అలాంటి మాటలకు ఈ ఇంట్లో చోటు ఉండదు అని చెప్పాలి.

  6. పిల్లలు కలిసి ఆడుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఆడేటప్పుడు వాళ్లను గమనిస్తుండాలి.

  7. కొడితే పిల్లలు మారతారనుకోవడం సరైనది కాదు. కొడితే మరింత కోపానికి గురవుతారు. వారి మధ్య గొడవ పెరగడానికి దారి తీస్తుంది.

  8. పిల్లలకు సెల్ఫ్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నిక్స్‌ గురించి నేర్పించాలి. కోపాన్ని ఎలా హ్యాండిల్‌ చేయాలో చెప్పాలి. డ్రమ్స్‌ వాయించడం, పది నుంచి ఒకటి వరకు అంకెలు వెనక్కి కౌంట్‌ చేయమనడం, సౌండ్‌ ఎక్కువగా పెట్టి డ్యాన్స్‌ చేయడం... ఇలాంటి పనుల ద్వారా కోపాన్ని డైవర్ట్‌ చేసుకొమ్మని చెప్పాలి. ఎంత కోపంగా ఉన్నారో ఒక పేపర్‌ తీసుకుని షార్ట్‌ స్టోరీ రాయమనాలి. అంతేకానీ కొట్టడం, గిల్లడం, కొరకడం చేయకూడదని వివరించాలి.

  9. ఇతర పిల్లల ఫీలింగ్స్‌పై కామెంట్స్‌ చేయడం ద్వారా పిల్లల్లో సానభూతి పెంపొందేలా చేయాలి. ‘‘బన్నీని చూడు. ఎలా ఏడుస్తున్నాడో... పాపం కదా!’’ అని కామెంట్స్‌ చేయడం ద్వారా పిల్లల్లో సానుభూతి పెరిగేలా చేయాలి.

  10. రాత్రి డిన్నర్‌ను కుటుంబసభ్యులందరూ కలిసి చేయాలి. ఆ సమయంలో ఆ రోజు ఎవరు ఏం చేశారో తెలుసుకుని అభినందించుకునేలా ప్రోత్సహించాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో మార్పును తీసుకురావచ్చు.

  11. పిల్లలిద్దరూ గొడవ పడుతున్నా వాళ్లు కిడ్స్‌ అని తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒక టైంలో ఏ పిల్లవాడైనా తమ సిబ్లింగ్స్‌ పట్ల కోపంగా వ్యవహరిస్తారు, కొట్లాడతారు. పెద్దవాళ్లు అవుతున్న కొద్దీ వాళ్లలో మార్పు కనిపిస్తుంది.

Updated Date - Sep 22 , 2024 | 05:07 AM