Share News

Relationship Tips: రిలేషన్‌షిప్‌లో ఈ తప్పు అస్సలు చేయకండి..

ABN , Publish Date - Jul 25 , 2024 | 05:24 PM

Relationship Tips: వివాహ బంధమైనా.. ప్రేమ అయినా.. ఏ బంధం నిలబడాలన్నా.. ఆ బంధం బలోపేతం అవ్వాలన్నా.. నమ్మకం, విశ్వాసం అనేవి చాలా ముఖ్యం. వీటితో పాటు.. మరికొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే..

Relationship Tips: రిలేషన్‌షిప్‌లో ఈ తప్పు అస్సలు చేయకండి..
Relationship Tips

Relationship Tips: వివాహ బంధమైనా.. ప్రేమ అయినా.. ఏ బంధం నిలబడాలన్నా.. ఆ బంధం బలోపేతం అవ్వాలన్నా.. నమ్మకం, విశ్వాసం అనేవి చాలా ముఖ్యం. వీటితో పాటు.. మరికొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే.. ఆ సంబంధంలో విభేదాలు తలెత్తి విడిపోయే స్థితికి చేరుతుంది. అలాంటి సందర్భాల్లో కొన్ని విషయాల పట్ల జాగ్రత్త వహిస్తే.. సంబంధంలో ఎలాంటి పొరపొచ్చాలు ఏర్పడవు. మరి ప్రేమ, వివాహ బంధం బలంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం పాటించాలో ఈ కథనంలో తెలుసుకుందాం..


పొరపాటున కూడా ఈ తప్పులు చేయొద్దు..

బంధం విచ్ఛిన్నం కావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఆ కారణాలను పసిగట్టి.. తప్పులు చేయకుండా ఉండటం చాలా ఉత్తమం. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని తప్పులు.. సంబంధాన్ని బలహీనపరుస్తాయి. ఉదాహరణగా చూసుకుంటే.. చాలా వరకు పెళ్లైన కొత్త జంటలు తొలినాళ్లలో సరదాగా, సంతోషంగా ఉంటారు. కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత వారి సాన్నిహిత్యంలో తేడా కనిపిస్తుంది. ఒకరినొకరు తక్కువగా భావించడం, బేదాభిప్రాయాల కారణంగా ఆ బంధం మునుపటి స్థితిలో ఉండదు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కపుల్స్.. వీటిని తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.


ఒకరికొకరు సమయం ఇచ్చుకోవాలి..

ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో స్త్రీ పురుషులు ఇద్దరూ బిజీగా గడిపేస్తున్నారు. అయినప్పటికీ.. దంపతులిద్దరూ ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకుని రోజూ ఒకరికొరు సమయం కేటాయించుకోవాలి. పెళ్లైన కొత్తలో కేటాయించినంత టైమ్ కొన్ని సంవత్సరాల తరువాత కేటాయించలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో ఒకరినొకరు అర్థం చేసుకుని.. సమయాన్ని అడ్జస్ట్ చేసుకుని కలిసి ఉండాలి. లేదంటే దంపతుల మధ్య పొరపొచ్చాలు ఏర్పడే ప్రమాదం ఉంది. అప్పుడలా ఉన్నారు.. ఇప్పుడలా లేరు అంటూ అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది.


కమ్యూనికేషన్ గ్యాప్‌ వొద్దు..

దంపతులిద్దరి మధ్య ఏర్పడే మనస్పర్థలను నివారించడానికి ప్రతిరోజూ మీ భాగస్వామికి సమయం కేటాయించాలి. పొరపాటున కూడా కమ్యూనికేషన్ గ్యాప్‌ను కొనసాగించొద్దు. కమ్యూనికేషన్ గ్యాప్ అనేది సంబంధం విచ్ఛిన్నానికి దారి తీస్తుంది. మీ భాగస్వామితో ఓపెన్‌గా మాట్లాడాలి. మీ భావాలను నిజాయితీగా పంచుకోవాలి. రోజులో ఏం జరిగినా మీ భాగస్వామితో స్వేచ్ఛగా మాట్లాడాలి.


ఒకరినొకరు గౌరవించుకోవాలి..

ప్రేమ అయినా.. వివాహ బంధమైనా.. కపుల్స్ ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవాలి. అవమానించకూడదు. చిన్న చిన్న తగాదాలు జరిగినప్పుడు ఒకరినొకరు దూషించుకుంటారు. అవమానపరిచే కామెంట్స్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య అగాధం పెరుగుతుంది. అందుకే.. మీ బంధం స్ట్రాంగ్‌గా ఉండాలంటే.. ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఏవైనా సమస్యలుంటే.. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుని ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. అంతేతప్ప.. చిన్న చిన్న విషయాలకు గొడవపడి.. ఒకరినొకరు కించపరుచుకుంటే విడిపోవడమే జరుగుతుంది.


పాత విషయాలను మరచిపోండి..

చాలా మంది దంపతులు.. తమ మధ్య ఏదైనా గొడవ జరిగితే పదే పదే గతంలో వారు చేసిన పొరపాట్లు, తప్పులను ప్రస్తావిస్తుంటారు. అయితే, అలా చేయడం వల్ల ఆ బంధంలో ఎడబాటు మరింత పెరుగుతుంది. అందుకే.. కపుల్స్ ఎప్పుడూ ఇలాంటి పని చేయకూడదు. పాత విషయాలను మర్చిపోయి.. మీ భాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదించండి. అయిపోయిన విషయాలను కాకుండా.. భవిష్యత్‌ కోసం ఆలోచించి హ్యాపీగా ఉండండి. ఈ సూచనలు పాటించడం ద్వారా దంపతులు తమ బాంధవ్యాన్ని సాఫీగా, హ్యాపీగా కొనసాగించవచ్చు.


Also Read:

రోహిత్, కోహ్లీలకు కొత్త ఫిట్టింగ్.. అదే జరిగితే..

45 ఏళ్లకే రిటైర్ అవ్వాలని ప్లాన్! కష్టపడి రూ.5.35 కోట్లు కూడబెడితే..

నాగుతో నాగరాజు ఆట.. తర్వాత ఏమైందంటే..?

For More Lifestyle News and Telugu News..

Updated Date - Jul 25 , 2024 | 05:24 PM