Share News

NRI: ఎన్నారై తెలుగుదేశం ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం

ABN , Publish Date - May 05 , 2024 | 07:01 PM

తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దత్తుగా కువైట్‌లో ఎన్నారైలు విస్తృత ప్రచారాన్ని చేపట్టారు.

NRI: ఎన్నారై తెలుగుదేశం ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం

కువైట్‌లో నివసిస్తూ వివిధ కంపెనీలలో మంచి మంచి ఉద్యోగాల్లో పనిచేస్తున్న చాలామంది తెలుగువారు (NRI), అలాగే కువైటీ ఇళ్ళల్లో పనిచేసే డ్రైవర్లు, డొమెస్టిక్ వర్కర్సుకు సెలవలు లేకపోవడం, లేదా చార్జీలు పెట్టుకొని అంత దూరం రాలేకపోవటం వలన ఎక్కువశాతం మే 13న జరగబోయే శాసనసభ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేరు. అయితే ఆంద్రప్రదేశ్‌లో ఉంటున్న వారి కుటుంబ సభ్యులను, అక్కా చెల్లెళ్ళను, అన్నా తమ్ముళ్ళను, స్నేహితులను వీరు ప్రభావితం చేసే విధంగా వారందరికీ ఫోన్లు చేసి మాట్లాడటానికి చాలా అవకాశం ఉంటుంది.

2.jpgఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ (TDP) కూటమికి మద్దత్తుగా కువైట్‌లో (Kuwait) ఎన్నారైలు విస్తృత ప్రచారాన్ని (Election Campaign) చేపట్టారు. తెలుగుదేశం పార్టీ గల్ఫ్ ఎంపవర్మెంట్ కో-ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర రావు ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు షేక్ బాషా, అద్దేపల్లి చిన్నా రాజు, కుటుంబ రావు, కోడూరు మహేష్ గౌడ్, గుణపాటి చిన్నబాబు, హరికృష్ణ మొదలగు వారు కువైట్‌లో వివిధ రకాల పార్కుల్లో జమ అయ్యే తెలుగువారిని కలుసుకొని ఉమ్మడి మానిఫెస్టోలోని పథకాలను గురించి వివరిస్తూ ఇండియాలో ఉంటున్న వారి కుటుంబ సభ్యులను, స్నేహితులను ఉమ్మడి అభ్యర్థులకు ఓటు వెసేలాగా వారికి ఫోన్లు చేసి తెలుపవలసిందిగా కోరుతున్నారు.

NRI: బీజేపీ గెలుపు కోసం ఎన్నారైల ప్రచారం

3.jpg


అలాగే కువైట్‌లోని ప్రముఖ ఆయిల్ కంపెనీలలో ఉద్యోగం చేస్తున్న ప్రముఖులను కుదరవల్లి సుధాకరరావు కలిసి వారికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పరిస్థిని వివరిస్తూ, చంద్రబాబు మరలా ముఖ్యమంత్రి అయితేగాని మన ఆస్తులకు రక్షణ ఉంటుందని, రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుందని, ఎన్నో కంపెనీలు వచ్చి రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్ళుతుందని వివరిస్తూ కువైట్‌లో వారు పని చేస్తున్న కంపెనీలో ఉన్నటువంటి తెలుగు వారికి, ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్న వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలుగుదేశం కూటమి అభ్యర్ధులకు ఓటు వేసేలాగా తెలియచేయాలని విన్నవిస్తున్నారు.

4.jpgప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, మద్యం, ఇసుక మాఫియాలు రాజ్యం ఏలుతున్నాయని, వీటినుండి రాష్ట్రాన్ని కాపాడలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని వీరందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు.

ఈ సందర్భంగా కుదరవల్లి సుధాకర్ రావు మాట్లాడుతూ ఎన్నికల రోజు వరకు కూడా కువైట్‌లో తెలుగువారు అధికంగా నివసించే ఏరియాలు, వర్కర్ క్యాంపులు, కంపెనీలలో ఉన్న వారిని అందరిని సాధ్యమైనంత వరకు కలిసి ఇదే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ భారతదేశంలో ఉన్న వారి బంధుమిత్రులకు ఫోన్లో మాట్లాడి తెలుగుదేశానికి ఘనవిజయం చేకూర్చే విధంగా ప్రణాళికలు తయారు చేసుకున్నామని తెలియజేసారు.

5.jpg6.jpg7.jpgRead NRI and Telugu News

Updated Date - May 05 , 2024 | 07:13 PM