Share News

NRI: దుబాయి చావు కాలంలో తోడుగా వచ్చే రారాజు నరేంద్ర

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:28 PM

ఆపద కాలంలో నిరాశనిట్టూర్పులతో ఉండే తెలుగు కుటుంబాలకు సహాయం చేసే కొందరిలో గడ్చంద నరేందర్ ఒకరు. దుబాయ్‌‌లో మరణించిన వారి మృతదేహాలను తరలించడంలో ఎందరికో సాయం చేసి మనన్నలు పొందారు.

NRI: దుబాయి చావు కాలంలో తోడుగా వచ్చే రారాజు నరేంద్ర

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: ‘పుట్టిన వాడు గిట్టక మానడు’ అని భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పినట్లుగా మరణం ఏ జీవికైనా అనివార్యం కానీ ఆ మృత్యువు ఏదో తాను పుట్టి పెరిగిన చోటా కాకుండా అందునా ఎక్కడో పరాయి దేశంలో అందునా ఎడారిలో సంభవిస్తే ఆత్మ క్షోభించాల్సిందే.

పొట్టకూటి కోసం ఎడారి దేశాలకు వచ్చి మృత్యువుపాలైతే వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు ఆవేదన, ఆక్రంద వర్ణనాతీతం. సగటున రోజుకు అయిదుగురు భారతీయులు (NRI) మరణించే దుబాయిలో చావు అనేది నిత్య కార్యం. మరణానంతరం చేయవల్సిన అధికారిక ప్రక్రియలు పూర్తి చేయడంలో మృత్యుల కుటుంబాలకు సహాయం చేయడానికి అనేక మంది భారతీయులు సేవలందిస్తున్నారు. ఈ దిశగా దుబాయిలో కొందరు తెలుగు ప్రవాసీయులు కూడా ఉన్నారు.

Gulf ikya vedika: కరోనా కష్ట కాలంలో ఆదుకున్న అర్వింద్

ఆపద కాలంలో నిరాశనిట్టూర్పులతో ఉండే తెలుగు కుటుంబాలకు సహాయం చేసే కొందరిలో గడ్చంద నరేందర్ ఒకడు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన నరేందర్ దుబాయి గడ్డపై ఏ తెలంగాణ వాసికి ఆపద వచ్చినా ఆదుకోవడానికి అగ్రభాగాన ఉంటాడు. సేవ చేయడానికి పెద్ద కారు, ఆకర్షణీయమైన సూటు కాదు, అంకితభావం, సహాయగుణం ఉంటేచాలని చెప్పడానికి నరేందర్ ఒక ఉదహారణ. గుండెపోటుతో మరణించిన నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజల్ గ్రామానికి చెందిన పోలేపు గంగయ్య మృతదేహాన్ని సకాలంలో పంపించడంలో ఆయన చూపిన చొరవ అభినందనీయం.

2.jpg


అదే విధంగా నిజామాబాద్ జిల్లా కలస్పూర్ తండాకు చెందిన చరణ్ లవజాత్ అనే గిరిజన రోగిని కూడా ఆసుపత్రి నుండి డిశ్చార్జి చేసి స్వదేశానికి పంపించడంలో నరేందర్ చేసిన సహాయాన్ని అనేకులు అభినందిస్తున్నారు. పొట్టకూటి కోసం చేసేది ఒక మాములు స్థాయి ఉద్యోగం అయినా కోటీశ్వురులకు లేని సహాయగుణం నరేందర్‌లో ఉంది.

ప్రవాసీయుల స్వచ్ఛంధ సంస్థ అయిన జి.డబ్ల్యు.ఎ.సి లో కూడా చురుగ్గా ఉండే నరేందర్ తనకు అన్నింటా అండగా నిలిచే ఆబుదాబిలోని తెలుగు ప్రవాసీ ప్రముఖుడు రాజా శ్రీనివాస రావు, జి.డబ్ల్యు.ఎ.సి సంస్థ అధ్యక్షుడు ధోనికెని కృష్ణ, కటకం రవిల సహాయం వలన తాను కష్టాలలో ఉన్న నలుగురికి మద్దతుగా నిలుస్తున్నానని చెప్పాడు.

Read Latest NRI and Telugu News

Updated Date - Apr 25 , 2024 | 04:47 PM