NRI: మోస్ట్ వాంటెడ్ లిస్టులో భారతీయుడు.. అతడి ఆచూకీ చెప్పినవాళ్లకు రూ.2 కోట్లు ఇస్తామన్న అమెరికా
ABN , Publish Date - Apr 13 , 2024 | 05:52 PM
హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఓ భారతీయుడి ఆచూకీ చెప్పిన వారికి అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ఏకంగా రూ.2.1 కోట్ల రివార్డు ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: పరారీలో ఉన్న ఓ భారతీయుడి ఆచూకీ చెప్పిన వారికి అమెరికా (USA) కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ఏకంగా రూ.2.1 కోట్ల రివార్డు ప్రకటించింది. ఎఫ్‌బీఐ తెలిపిన వివరాల ప్రకారం, గుజరాత్‌కు చెందిన భద్రేశ్‌కుమార్ చేతన్ భాయ్ పటేల్ 2015లో తన భార్యను హత్య చేశాడు. నాటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు. అతడి నేర తీవ్రత దృష్ట్యా టాప్ 10 నేరస్తుల జాబితాలో చేర్చినట్టు ఎఫ్‌బీఐ పేర్కొంది (FBI Announces 2.1 Crore Reward On Indian Man).
Immigration: ఇండియన్స్‌కు షాక్..ఈ దేశం వెళ్లాలంటే భారీగా ఆదాయం..
మేరీల్యాండ్‌లోని (Maryland) వాంకూవర్‌లో వారు పనిచేస్తున్న ఓ రెస్టారెంట్‌లోనే భద్రేశ్‌కుమార్ ఏప్రిల్ 12న తన భార్యను హత్య చేసినట్టు ఎఫ్‌బీఐ తెలిపింది. రెస్టారెంట్ వెనకవైపు అతడు కత్తితో తన భార్యను దారుణంగా పొడిచి చంపేశాడు. నైట్ షిఫ్ట్ సందర్భంగా ఈ హత్య జరిగింది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం అతడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిపై అరెస్ట్ వారెంట్ జారీ అవ్వడంతో అతడు కనిపించకుండా పోయాడు.
అతడి ఆచూకీ కనుక్కునేందుకు పోలీసులు నిరంతరంగా శ్రమిస్తున్నారని స్థానిక అధికారులు తెలిపారు. స్థానికులు నుంచి సమాచారం వస్తే త్వరలో నిందితుడి ఆచూకీ పట్టుకుంటామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అతడిని అరెస్టు చేసి, తగిన శిక్ష పడేలా చేసేంతవరకూ తాము విశ్రమించబోమని స్పష్టం చేశారు.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి