Fire Accident: న్యూయార్క్ భవనంలో అగ్నిప్రమాదం.. ఇండియన్ జర్నలిస్ట్ మృతి, 17 మందికి గాయాలు
ABN , Publish Date - Feb 25 , 2024 | 10:23 AM
అమెరికాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 27 ఏళ్ల భారతీయ జర్నలిస్ట్ మృత్యువాత చెందాడు. ఈ క్రమంలో స్పందించిన భారత రాయబార కార్యాలయం మరణించిన ఫాజిల్ ఖాన్ కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.
అమెరికా(america)లోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 27 ఏళ్ల భారతీయ జర్నలిస్ట్ మృతి చెందాడు. మరణించిన వ్యక్తి పేరు ఫాజిల్ ఖాన్ అని న్యూయార్క్(New York)లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఓ బైకులోని లిథియం-అయాన్ బ్యాటరీ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం(fire accident) సంభవించిందని అమెరికన్ మీడియా పేర్కొంది. ఈ ప్రమాదం కారణంగా న్యూయార్క్‌లోని హార్లెమ్‌లోని ఓ అపార్ట్‌మెంట్ భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
ఈ ఘటనపై స్పందించిన భారత రాయబార కార్యాలయం ఫాజిల్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసింది. మరణించిన అయన కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకెళ్లేందుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని రాయబార కార్యాలయం సోషల్ మీడియా(social media) ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఫాజిల్ జర్నలిజంలో డిగ్రీ చేసేందుకు 2020లో న్యూయార్క్ వెళ్లాడు. అక్కడే ఉన్న కొలంబియా జర్నలిజం స్కూల్లో కోర్సును పూర్తి చేసినప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు.
శుక్రవారం అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగగా ఒకరి మృతితో పాటు 17 మంది గాయపడ్డారు. ఆరు అంతస్తుల భవనంలోని మూడో అంతస్తులో మంటలు(fire) చెలరేగాయి. అనంతరం మంటలు ఇతర అంతస్తులకు వ్యాపించాయి. భవనంలో చిక్కుకున్న పలువురు కిటికీల నుంచి దూకి బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది కూడా నేరుగా భవనంలోకి ప్రవేశించలేకపోయారు. ఆ తర్వాత అక్కడి వారిని తాళ్ల ద్వారా కిందకు తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది, ఇతర శాఖల అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని నష్టాన్ని పరిశీలించారు. ఘటనపై విచారణ కొనసాగుతోంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Gaza: దాడులతో కాదు.. ఆకలితో చచ్చిపోతున్నాం.. గాజాలో దారుణ పరిస్థితులు..