NRI: ఆమెను శాశ్వత నిద్రలోకి పంపించా.. ఇండియాలోని తల్లికి ఎన్నారై ఊహించని వీడియో కాల్!
ABN , Publish Date - Mar 19 , 2024 | 04:27 PM
భార్యను చంపిన కేసులో కెనడాలోని ఓ ఎన్నారైపై తాజాగా మర్డర్ కేసు నమోదైంది.
ఎన్నారై డెస్క్: భార్యను చంపిన కేసులో కెనడాలోని (Canada) ఓ ఎన్నారైపై (NRI) తాజాగా మర్డర్ కేసు నమోదైంది. భార్యను కత్తితో పొడిచి చంపేశాడని (Wife Murdered) అధికారులు ఆదివారం తెలిపారు. బ్రిటీష్ కొలంబియాలో (British Columbia) మార్చి 15న ఈ ఘటన జరిగింది. ఆ రోజు అబాట్స్‌ఫోర్డ్‌లోని ఓ ఇంటికి వెళ్లిన అత్యవసర సిబ్బందికి బల్వీందర్ సింగ్ (41) అనే మహిళ కత్తిపోట్లకు గురై కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆ తరువాత కాసేపటికే మృతి చెందింది. ఆమె భర్త జస్ప్రీత్ సింగ్‌ను పోలీసులు అదే రోజు అదుపులోకి తీసుకున్నారు.
Indian Origin Couple: కెనడాలో భారత సంతతి ఫ్యామిలీ మృతి.. అనుమానాస్పదంగా కేసు, ప్రమాదమేనా?
జస్ప్రీత్ సింగ్ తన భార్యను హత్య చేశాక లూథియానాలోని (పంజాబ్) తన తల్లికి వీడియో కాల్ చేసినట్టు మృతురాలి సోదరి పేర్కొంది. భార్యను శాశ్వత నిద్రలోకి పంపినట్టు నిందితుడు తన తల్లి్కి చెప్పాడని అంది. జస్ప్రీత్‌కు ఉద్యోగం లేదని, ఆర్థిక సమస్యల కారణంగా ఆ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవని కూడా పేర్కొంది. ఘటనకు వారం క్రితమే అతడు కెనడాకు వెళ్లినట్టు చెప్పింది. జస్ప్రీత్, బల్వీందర్ కౌర్‌కు 2000లో వివాహం జరిగింది. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కెనడాలో చదువుకుంటున్న కుమార్తె వద్దే బల్వీందర్ కౌర్ ఉంటున్నారు.
అయితే, బల్వీందర్ కౌర్ కుటుంబసభ్యుల ఆరోపణలను జస్ప్రీత్ బంధువులు తోసి పుచ్చారు. ఆ జంట మధ్య ఎటువంటి గొడవలు లేవని, వారు చాలా సంతోషంగా ఉండేవారని చెప్పుకొచ్చారు. ‘‘ఆ రోజు నా సోదరుడికి అతడి భార్యకు మధ్య ఏం జరిగిందనేదానిపై స్పష్టత లేదు. మేము కానీ, అతడు కానీ బల్వీందర్ కౌర్‌ను ఎప్పుడూ వేధించలేదు. ఘటనకు కొంత సేపటి క్రితమే వాళ్లు షాపింగ్ చేసుకుని వచ్చారు. ఘటన తరువాత జస్ప్రీత్ మా అమ్మకు ఫోన్ చేసి పొరపాటున తన భార్యను గాయపరిచినట్టు చెప్పాడు. క్షమాపణలు చెప్పాడు. ఇదంతా కావాలని చేసింది కాదు. వారి కుమార్తె కూడా ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో అసలేం జరిగిందనే దానిపై స్పష్టత లేదు’’ అని జస్ప్రీత్ సోదరుడు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి