Indian Origin Couple: కెనడాలో భారత సంతతి ఫ్యామిలీ మృతి.. అనుమానాస్పదంగా కేసు, ప్రమాదమేనా?
ABN , Publish Date - Mar 16 , 2024 | 10:37 AM
ఓ ఇంట్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి భారత సంతతికి చెందిన దంపతులతోపాటు(Indian Origin Couple) వారి 16 ఏళ్ల కుమార్తె కూడా మరణించింది. అయితే వీరి మృతి ప్రస్తుతం అనుమానాస్పదంగా మారింది. ఆ విరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఓ ఇంట్లో ఆకస్మాత్తుగా మంటలు(fire) చెలరేగి భారత సంతతికి చెందిన దంపతులతోపాటు(Indian origin couple) వారి 16 ఏళ్ల కుమార్తె(daughter) కూడా మరణించింది. అయితే మంటలు వ్యాపించడానికి ముందు వారంతా ఆ ఇంట్లోనే ఉన్నారని, బయటకు వచ్చే అవకాశం కూడా ఉందని పలువురు అంటున్నారు. దీంతో వీరి మృతి(died) ప్రస్తుతం అనుమానాస్పదంగా మారింది. అసలు వారంతా నిజంగానే అగ్ని ప్రమాదంలో మృత్యువాత చెందారా లేదా ఎవరైనా కావాలనే హత్యకు ప్లాన్ చేశారా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషాధ ఘటన కెనడా(Canada)లోని అంటారియోలో మార్చి 7న చోటుచేసుకుంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Gold Seized: ఐడియా చుశారా ఖర్జూరంలో దాచి రూ.1.72 కోట్ల గోల్డ్ అక్రమ రవాణా.. చివరకు
ఈ విషయం తెలిసి కేసు నమోదు చేసిన పోలీసులు(police) హత్య కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు ఈ అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తు జరిగినది కాదని నిర్ధారించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో కేసును అనుమానాస్పదంగా(Suspicious case) పరిగణించి దర్యాప్తు చేస్తున్నామని అక్కడి పోలీసులు(police) వెల్లడించారు. మార్చి 7న బ్రాంప్టన్‌లోని బిగ్ స్కై వే, వాన్ కిర్క్ డ్రైవ్ పరిసరాల్లోని ఓ ఇంట్లో మంటలు చెలరేగిన క్రమంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు రాజీవ్ (51), అతని భార్య శిల్పా కోతా (47), వారి 16 ఏళ్ల కుమార్తె మహేక్ మృత్యువాత చెందారు.
మరోవైపు ఈ ఫ్యామిలీ(family) దాదాపు 15 ఏళ్లుగా ఎలాంటి సమస్య లేకుండా ఇక్కడే నివాసముంటున్నారని స్థానికుడు యూసుఫ్ తెలిపారు. గత వారం పెద్దగా చప్పుడు వినిపించిన తర్వాత ఆ ఇంట్లో మంటలు చెలరేగినట్లు యూసఫ్ వెల్లడించారు. కొన్ని గంటల్లోనే ఇల్లంతా(house) మంటల్లో కాలిపోయి శిథిలాలుగా మారిందని ఆయన అన్నారు.