NRI: పోలింగ్‌కు పోటెత్తిన ఎన్నారై టీడీపీ నేతలు!
ABN , Publish Date - May 13 , 2024 | 03:43 PM
తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అమెరికాతో పాటు పలు దేశాలలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు, ఎన్నారై టీడీపీ నేతలు ఏపీకి భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనల మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీ సంఖ్యలో ఓటర్లు తరలి వస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అమెరికాతో పాటు పలు దేశాలలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు, ఎన్నారై టీడీపీ నేతలు ఏపీకి భారీ సంఖ్యలో తరలివచ్చారు. వారంతా తమ తమ స్వస్థలాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే ఎన్నారై టీడీపీ మీడియా కో-ఆర్డినేటర్ సాగర్ దొడ్డపనేని తన ఓటు హక్కును ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వినియోగించుకున్నారు.
America Tech Industry: 'ఇండియన్స్ లేకుండా US టెక్ పరిశ్రమ మనుగడ కష్టం'
ఈసారి ఎన్నికల్లో పలు దేశాల నుంచి ఎన్నారైలు భారీ సంఖ్యలో తరలి రావడం విశేషం. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతుగా టీడీపీ ఎన్నారై నేతలు పోలింగ్ రోజున ఓటు వేయడమే కాకుండా టీడీపీ కూటమిని గెలిపించాలని, చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని ఓటర్లును చైతన్యపరుస్తూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లు భారీ సంఖ్యలో తరలి వచ్చి కూటమి బలపరిచిన టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిస్తున్నారు. కేవలం ఏపీ భవిష్యత్తు బాగుండాలని, మరోసారి బాబుగారిని సీఎం చేయాలని అమెరికా నుంచి ఆంధ్రాకు ఓటు వేసేందుకు ప్రత్యేకంగా వచ్చామని తెలిపారు. ఏపీలో ఉన్న ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని టీడీపీ ఎన్నారై నేతలు పిలుపునిస్తున్నారు. మేము ఓటు వేశాం..మరి మీరు? అంటూ తమ వేలికి ఇంక్ గుర్తు ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి రావాలని, సమయం లేదు మిత్రమా..రణమా..శరణమా అంటూ ఓటరు మహాశయులకు పిలుపునిస్తున్నారు.
Read Latest NRI News and Telugu News